ప్రమాదం అంచున బ్రతుకు ప్రయాణం

ప్రమాదం అంచున బ్రతుకు ప్రయాణం
x
Highlights

ఆ ప్రయాణం సాహసం ఆ ప్రయాణం ప్రమాదం. ఐనా బతుకుపోరాటం కోసం సాగించేల్సిందే అనుకొని ప్రమాదాలు జరిగితే బలికావాల్సిందే. గమ్యస్థానానికి చేరుకుంటామో లేదో...

ఆ ప్రయాణం సాహసం ఆ ప్రయాణం ప్రమాదం. ఐనా బతుకుపోరాటం కోసం సాగించేల్సిందే అనుకొని ప్రమాదాలు జరిగితే బలికావాల్సిందే. గమ్యస్థానానికి చేరుకుంటామో లేదో నమ్మకం ఉండదు. తిరిగి వస్తామన్న ఆశ ఉండదు. కానీ ప్రయాణించాల్సిందే ఉమ్మడి ఆదిలాబాద్ లో ప్రమాదపుటంచున సాగుతున్న నాటు పడవల ప్రయాణంపై హెచ్ఎంటీవీ స్పెషల్ రిపోర్ట్.

నది తీరం. ఎటు చూసినా పచ్చదనం ప్రకృతి ఒడిలో గ్రామం ఆహా ఎంత హాయి జీవితమో అనుకుంటున్నారా కానీ ఆ గ్రామస్తులకు ప్రయాణమే ఓ నరకం. పొరుగూరికి వెళ్లాలన్నా తిరిగి రావాలన్నా సాహసం చేయాలి. ప్రాణాల మీద ఆశలు వదలుకొని మరీ ప్రయాణించాలి. ఇదీ ఆదిలాబాద్ జిల్లా బీమ్ పూర్ మండలం అంతర్గామ్ గ్రామస్తుల దుస్థితి.

మహారాష్ట్ర, తెలంగాణకు మధ్య పెన్ గంగా నది ప్రవహిస్తోంది. ఈ నదీ తీరాన ఉన్న గ్రామమే అంతర్గామ్ గ్రామం. ఈ గ్రామస్తులు బతకుపోరాటం కోసం ఆ నది దాటాల్సిందే అందుకు వీళ్లకు నాటు పడవలే దిక్కు అవి తరచూ ప్రమాదాలకు గురవుతున్నా ప్రయాణించక తప్పడం లేదని అంటున్నారు గ్రామస్తులు. పెన్ గంగా ఏడాదిలో 9 నెలల పాటు భారీ వరద ఉధృతితో ప్రవహిస్తుంది. అలాంటి సమయంలో గ్రామస్తులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణం సాగిస్తుంటారు. గడపదాటిన మనిషి ఇంటికి తిరిగివచ్చేవరకు నమ్మకం ఉండదు. వారి సాగించే ప్రయాణం గమ్యస్థానానికో కాటికో తెలియని పరిస్థితి.

తాజాగా ఈ నదిలో నాటు పడవ అదుపు తప్పి బోల్తా పడింది. అందులో ఉన్న ఎనిమిది మంది మహిళలు నదిలో పడిపోయారు. కానీ అక్కడ ఉన్నవారు సకాలంలో స్పందించి మహిళల ప్రాణాలను కాపాడారు. అలాగే కుమ్రంబీమ్ కౌటలా మండలంలో ప్రాణహిత నదిలోనూ నెలరోజుల క్రితం నాటు పడవ అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు ప్రాణాలు విడిచారు. ఇలాంటి ప్రమాదాలు నిత్యం జరుగుతున్నా నాటు పడవ ప్రయాణమే వారికి శరణ్యమైంది.

నాటు పడవ ప్రయాణానికి పరిమితులు ఉండవు. ఇద్దరు మాత్రమే ప్రయాణించాల్సిన పడవలో పదుల సంఖ్యలో ఎక్కించి తీరం దాటించే ప్రయత్నం చేస్తారు. ఎలాంటి భద్రత చర్యలు చేపట్టారు. అనుకోని ప్రమాదం జరిగితే బయటపడానికి గార్డ్స్ ఉండవు. అందుకే నాటు పడవలు తరుచూ ప్రజల ప్రాణాలను మింగేస్తున్నాయి. ఇప్పటికైన నాటు పడవల ప్రయాణంపై ప్రభుత్వం దృష్టిపెట్టాలని నదీతీరాన ఉన్న గ్రామస్తులు కోరుతున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories