నిందితులను ఎన్కౌంటర్ చేయడం వలన మహిళలో దైర్యం వచ్చింది : రేణూ దేశాయ్

మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన వారికీ ఉరిశిక్ష విధించాలని, చట్టాలను కూడా పటిష్టంగా అమలు చేయాలనీ అన్నారు సినీ నటి
మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన వారికీ ఉరిశిక్ష విధించాలని, చట్టాలను కూడా పటిష్టంగా అమలు చేయాలనీ అన్నారు సినీ నటి, సామాజిక వేత్త రేణూ దేశాయ్.. ఓ మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన రేణు మాట్లాడుతూ.. దిశ హత్య కేసులో నిందితులను ఎన్కౌంటర్ చేయడం వలన మహిళలో దైర్యం వచ్చిందని అన్నారు. ఇక ఇంట్లో లక్ష్మీదేవి, సరస్వతిని పూజించే మొగవాళ్ళు తమ ఇంటి లక్ష్మి దేవిని మాత్రం సరిగ్గా చూసుకోవడం లేదని అన్నారు. భక్తీపై ఉన్న భయం చట్టాలపైన కూడా రావాలని రేణూ దేశాయ్ అన్నారు.
ఇక బట్టల వల్లే బలత్కారం అనే వాళ్లని అస్సలు క్షమించకూడదని అన్నారు. మరి అలా అయితే మూడు నెలల పసివాళ్లు ఎలాంటి బట్టలు వేసుకుంటున్నారని ప్రశ్నించారు. ఓ మహిళ మన ముందు నగ్నంగా ఉన్నా సరే అమ్మలా భావించి ఏమైందమ్మా అని అడిగి తనకు సాయం చేసే మానసిక పరిపక్వత మనలో రావాలని అన్నారు..
ఇక నిందితుల పట్ల ఎన్‌హెచ్చార్సీ స్పందించిన తీరు సరైందే కానీ దిశ మానవ హక్కులకు కూడా భంగం కలిగిన విషయాన్ని గుర్తించాలి కదా అని అన్నారు. రూపాన్ని బట్టి మనిషి అనకూడదని, అతని ప్రవర్తనని బట్టి అనాలని, స్కూటీని పంక్చర్ చేసి అత్యంత దారుణంగా అత్యాచారం చేసి చంపేయడం ఎంత వరకు సమంజసం ఇలాంటి వాళ్ళను జంతువులు గానే గుర్తించాలని, అలాంటి వాళ్లకు మానవ హక్కులు ఎలా వర్తిస్తాయని అన్నారు.
ప్రతీ ఒక్కరికీ ఒకే న్యాయం ఉండాలని తప్పు చేసింది ఎవరైనా శిక్షలు అందరికీ సమానంగా పడాలని అన్నారు రేణు దేశాయ్. ఇక నిన్నటి ఎన్‌కౌంటర్‌ను నేను పూర్తిగా అంగీకరించనని, అలాగని వ్యతిరేకించనని అన్నారు.. అయితే తెలంగాణ పోలీసుల చర్యకు ప్రజల ఆమోదం లభించడం చూస్తుంటే అత్యాచార ఘటన పట్ల వారు స్పందించిన తీరు స్పష్టమవుతోంది. నిజానికి దిశ ఘటనలో ఆ నలుగురు మాత్రమే కాదు. ఈ సమాజం మొత్తం ఆ నేరంలో భాగస్వామ్యమేనని అన్నారు రేణు దేశాయ్..