ESI స్కాంలో కదులుతున్న డొంక..

ESI స్కాంలో కదులుతున్న డొంక..
x
Highlights

ESI కుంభకోణంలో డొంక కదులుతోంది. దేవికారాణితో పాటు మరో ఆరుగురికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. నిందితులను కస్టడీకి అప్పగించాలంటూ ఏసీబీ అధికారులు...

ESI కుంభకోణంలో డొంక కదులుతోంది. దేవికారాణితో పాటు మరో ఆరుగురికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. నిందితులను కస్టడీకి అప్పగించాలంటూ ఏసీబీ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో మరికొందరి ప్రమేయం ఉన్నట్లయితే వారిని కూడా విచారిస్తామని ఏసీబీ అధికారులు చెబుతున్నారు.

ESI మందుల స్కాం కేసులో దేవికారాణితో పాటు ఆరుగురిని ఏసీబీ కోర్టులో ప్రవేశ పెట్టారు ఏసీబీ అధికారులు. ఏసీబీ కోర్టు వీరికి 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. అక్టోబర్ 11 వరకు రిమాండ్ కొనసాగనుంది. దీంతో ESI స్కాం కేసులోని నిందితులను చంచల్ గూడ జైలుకు తరలించారు. ఫోర్జరీ కింద 468 సెక్షన్, ఫోర్జరీ డాక్యుమెంట్స్ తో చీటింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణలపై 471 సెక్షన్, 120 Bసెక్షన్, ఫాల్సిఫికేషన్ ఆఫ్ అక్కౌంట్స్ కింద 477a సెక్షన్ తో పాటు పలు సెక్షన్ కింద కేసులను నమోదు చేశారు.

ఈ స్కాంలో రాజకీయ నేతల ప్రమేయంతో పాటు ఓ ఐఏఎస్ అధికారి ప్రమేయం ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఒకవేళ ఆధారాలు దొరికినట్లయితే వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని అంటున్నారు. 23 చోట్ల జరిగిన సోదాల్లో స్వాధీనం చేసుకున్న పత్రాలు, రికార్డులు పరిశీలించాల్సి ఉందంటున్నారు. ఇప్పటి వరకు 200 ఇండెంట్లు స్వాధీనం చేసుకోగా అందులో కేవలం 5 ఇండెంట్లు మాత్రమే పరిశీలించామని చెబుతున్నారు. దొంగ బిల్లులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఈ కేసులో మరికొందరి ప్రమేయం ఉన్నట్లయితే వారిని కూడా విచారిస్తామని చెబుతున్నారు.

ESI స్కాంలో లోతుగా విచారణ చేయాల్సిన అవసరం ఉంది. కోట్ల రూపాయల స్కాం జరిగినందున నిందితులను కస్టడీకి కోరుతూ ఏసీబీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీ పిటిషన్‌పై సోమవారం వాదనలు జరిగిన తర్వాత కోర్టు ఎన్ని రోజులు కస్టడీకి ఇస్తుందనే విషయం తెలియనుంది. ఇప్పటికే ఆరుగురు వ్యక్తుల స్టేట్‌మెంట్లు ఏసీబీ అధికారులు రికార్డు చేసుకున్నారు. వారి ప్రమేయం ఉన్నట్లు తేలితే వారిని కూడా అరెస్టు చేసి రిమాండ్ చేస్తామని అధికారులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories