రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తాసిల్దార్

రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తాసిల్దార్
x
Highlights

రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు.

రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు వికారాబాద్ జిల్లా పరిగి డిప్యూటీ తాసిల్దార్ వాజేష్.. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. పరిగిలోని సర్వే నంబర్ 25 లో వార్ల సూర్యకుమారి పేరిట రెండు ఎకరాల భూమి ఉండగా, అందులో ఎకరం స్థలంలో రైస్‌మిల్ ఉన్నది. మరో ఎకరం భూమికి సంబంధించి పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇవ్వడానికి, ఆన్‌లైన్‌లో పొందుపరిచేందుకు డిప్యూటీ తాసిల్దార్ వాజేష్ రూ.20వేలు లంచం డిమాండ్ చేశాడు.

దీనికి గాను సూర్యకుమారి కుమారుడు సతీశ్‌కుమార్ కూడా అంగీకరించారు. ఈ మేరకు మొదట రూ.5 వేలు ఇచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం వికారాబాద్ కలెక్టరేట్ వద్ద సతీశ్ కుమార్ నుంచి వాజేష్ రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అతన్ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతన్ని అదుపులోకి తీసుకొని ఏసీబీ కోర్టులో హాజరుపరుచనున్నట్టు ఏసీబీ అధికారులు వెల్లడించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories