హైదరాబాద్‌లో ఏసీబీ దాడులు.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ..

హైదరాబాద్‌లో ఏసీబీ దాడులు.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ..
x
హైదరాబాద్‌లో ఏసీబీ దాడులు
Highlights

హైదరాబాద్‌లో పలుచోట్ల అవినీతి నిరోదకశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైగా పనిచేస్తున్న సుధీర్‌రెడ్డిని ఏసీబీ...

హైదరాబాద్‌లో పలుచోట్ల అవినీతి నిరోదకశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైగా పనిచేస్తున్న సుధీర్‌రెడ్డిని ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఓ కేసు విషయంలో 50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఎస్సైని అరెస్ట్ చేశారు.

మరో ఘటనలో శేరిలింగంపల్లి జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్‌ యాదగిరి, అసిస్టెంట్ సాయి పట్టుబడ్డారు. ఓ బిల్డింగ్ అనుమతి ఇవ్వడం కోసం యాదగిరి 30 వేలు లంచం డిమాండ్ చేశారు. గతంలో 15 వేలు ఇచ్చిన బాధితుడు మిగతా 15 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులకు చిక్కాడు. యాదగిరితో పాటు అసిస్టెంట్ సాయిని కూడా అరెస్ట్ చేశారు.

మరోవైపు నాంపల్లిలోని చంద్రవిహఆర్‌ కార్యాలయంలో స్టేట్ జీఎస్టీ అధికారి కొమ్ము బుచ్చయ్య కూడా అవినీతి నిరోదక శాఖ అధికారులకు చిక్కారు. 35 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories