Top
logo

లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన వీఆర్వో

లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన వీఆర్వో
Highlights

రైతు దగ్గర లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు వీఆర్వో... రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం...

రైతు దగ్గర లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు వీఆర్వో... రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం తుర్కయాంజల్‌ గ్రామానికి వీఆర్వో గా పని చేస్తున్నాడు శంకర్‌... అయితే ముత్యంరెడ్డి అనే రైతు తనకు చెందిన ఎకరా ఇరవై గుంటల (1.20) భూమి మ్యూటేషన్‌ కోసం శంకర్ ని కలిసాడు. దీనికి గాను శంకర్ ముత్యంరెడ్డిని లక్ష రూపాయలు లంచం అడిగాడు. దీనితో ఆ రైతు 70 వేల రూపాయలు ఇస్తానని ఒప్పుకున్నాడు. ఆ తర్వాత ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారు చెప్పిన ప్లాన్ ప్రకారం ముత్యంరెడ్డి డెబ్బై వేల రూపాయలను వీఆర్వో శంకర్ కి ఇస్తుండగా ఏసీబీ అధికారులు అతనిని పట్టుకున్నారు. అనంతరం అతని ఇంట్లో కూడా సోదాలు నిర్వహించి అతనిని ఏసీబీ అధికారులు కోర్టుకు తరలించారు.

Next Story