ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం...

ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం...
x
Highlights

మూడు లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కింది ఓ అవినీతి తిమింగలం ... పాల్వంచ - కొత్తగూడెంలోని కేటిపిఎస్ లో చీఫ్ ఇంజనీర్ గా...

మూడు లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కింది ఓ అవినీతి తిమింగలం ... పాల్వంచ - కొత్తగూడెంలోని కేటిపిఎస్ లో చీఫ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న కర్రి ఆనందం అనే అధికారి మూడు లక్షల రూపాయలు లంచంగా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అతన్ని మాటు వేసి పట్టుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... కేటీపీఎస్‌ 5,6 దశలకు సంబంధించి లలితా మోహన్‌ అనే గుత్తేదారు పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో రూ.71 లక్షలకు బిల్లులు రావాల్సి ఉండగా వాటిని విడుదల చేసేందుకు సీఈ రూ.10 లక్షలు లంచం డిమాండ్‌ చేయడంతో లలితామోహన్‌ రూ. 2 లక్షలు ముట్టజెప్పారు. మిగిలిన డబ్బుకోసం సీఈ వేధిస్తుండటంతో ఆయన అనిశా అధికారులను ఆశ్రయించారు. వారు కర్రి ఆనంద్ ని రెడ్ హ్యాండడ్ గా పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. అతడి ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories