ఏసీబీకి చిక్కిన 'ఉత్తమ' కానిస్టేబుల్‌..!

ఏసీబీకి చిక్కిన ఉత్తమ కానిస్టేబుల్‌..!
x
Highlights

ఉత్తమ కానిస్టేబుల్‌గా మంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకున్న కానిస్టేబుల్ 24 గంటలు కూడా గడవకముందే లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడం తెలంగాణలో కలకలం...

ఉత్తమ కానిస్టేబుల్‌గా మంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకున్న కానిస్టేబుల్ 24 గంటలు కూడా గడవకముందే లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడం తెలంగాణలో కలకలం రేపింది. మహబూబ్‌నగర్‌ వన్‌టౌన్‌ పోలీసుస్టేషనులో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ తిరుపతిరెడ్డి ఆగస్టు 15న మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చేతుల మీదుగా ఉత్తమ కానిస్టేబుల్ అవార్డు అందుకున్నాడు. అయితే అతడే మరుసటి రోజు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు చిక్కాడు. దీంతో అవార్డుల ఎంపికపై ప్రజలు మండిపడుతున్నారు. మహబూబ్‌నగర్‌ వన్‌టౌన్‌ పోలీసుస్టేషనులో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ తిరుపతిరెడ్డి ఇసుక వ్యాపారుల వద్ద తరచూ డబ్బులు వసూలు చేసేవాడు. వెంకటాపూర్‌ గ్రామానికి చెందిన రమేశ్‌ అనే ఇసుక వ్యాపారి నిబంధనలకు అనుగుణంగానే ఇసుక తరలిస్తున్నప్పటికీ శుక్రవారం తిరుపతిరెడ్డి అతడిని అడ్డుకున్నాడు. రూ. 17,000 ఇస్తేనే ట్రాక్టరును విడిచిపెడతానని చెప్పాడు. దీంతో సదరు బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో తిరుపతి రెడ్డి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories