logo

5 సార్లు ఎమ్మెల్యే ... కానీ సాదాసీదా జీవితం...

5 సార్లు ఎమ్మెల్యే ... కానీ సాదాసీదా జీవితం...
Highlights

రాజకీయాల్లో పదవులు రాగానే గర్వం పెరుగుతుందని అంటారు. కానీ అ మాటలకు ఈయన విరుద్దం... అయన ఐదు సార్లు...

రాజకీయాల్లో పదవులు రాగానే గర్వం పెరుగుతుందని అంటారు. కానీ అ మాటలకు ఈయన విరుద్దం... అయన ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా అయన ఇప్పటికి సింపుల్ గానే ఉంటారు. సింప్లిసిటీనే మైంటైన్ చేస్తారు. ఆయనే గుమ్మడి నర్సయ్య.. ఈయన ఖమ్మం జిల్లా ఇల్లందు నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు . ఎదో పని మీదా అయన హైదరాబాదు కి వచ్చారు . మధ్యాహ్నం వేళ బాగ్‌‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద జీహెచ్‌‌ఎంసీ ఏర్పాటు చేసిన ఐదు రూపాయల భోజనం తింటూ కనిపించారు . ఆయన ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం కూడా ఇంతే సింప్లిసిటీని మైంటైన్ చేసారు . బస్సులో ,రైల్లో హైదరాబాద్ కి రావడం , ఆటోలో అసెంబ్లీకి వెళ్ళడం , పార్టీ ఆఫీస్ లో పడుకోవడం ఇది అయన ట్రాక్ రికార్డు .. ఇప్పటికి అయన పేరు మీదా ఓ పొలం తప్ప మరేమీ లేదు .. ఇంతా సింప్లిసిటీగా బతికే లీడర్ ని ఇక మనం భవిషత్తులో చూడలేం కావచ్చు బహుశా .. ! గ్రేట్ లీడర్


లైవ్ టీవి


Share it
Top