Top
logo

హైదరాబాద్‌లో ఆసరా పెన్షన్ల స్కామ్‌..250మంది పెన్షన్లను కాజేసిన కేటుగాళ్లు

హైదరాబాద్‌లో ఆసరా పెన్షన్ల స్కామ్‌..250మంది పెన్షన్లను కాజేసిన కేటుగాళ్లు
Highlights

హైదరాబాద్‌లో ఆసరా పెన్షన్ల స్కామ్‌ బయటపడింది. పాతబస్తీలో మూడు నెలలుగా ఆసరా పెన్షన్లను కాజేస్తున్న ముఠాను...

హైదరాబాద్‌లో ఆసరా పెన్షన్ల స్కామ్‌ బయటపడింది. పాతబస్తీలో మూడు నెలలుగా ఆసరా పెన్షన్లను కాజేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కలెక్టర్ ఫిర్యాదు మేరకు ఇమ్రాన్‌, సోహైల్‌, అస్లాం, మోసిన్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. ప్రభుత్వ ఉద్యోగి అస్లాం సాయంతో 250మంది పెన్షన్లను కాజేసినట్లు పోలీసులు గుర్తించారు. పెన్షన్లను కాజేస్తూ 2017లో ఒకసారి అరెస్టయిన అస్లాం ఇప్పుడు మరోసారి ఫించన్లను డైవర్ట్‌ చేస్తూ పోలీసులకు చిక్కాడు.

Next Story