తెలంగాణ వ్యాప్తంగా నిలిచిన ఆరోగ్యశ్రీ సేవలు

తెలంగాణ వ్యాప్తంగా నిలిచిన ఆరోగ్యశ్రీ సేవలు
x
Highlights

తెలంగాణ వ్యాప్తంగా ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయాయి. సుమారు 240 ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ, EHS , JHS సేవలు బంద్ అయ్యాయి. 1500 కోట్ల బకాయిల చెల్లింపులతో పాటు 2007లో చేసుకున్న MOU, ప్యాకేజీ రేట్స్ సవరణ చేయాలని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి.

తెలంగాణ వ్యాప్తంగా ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయాయి. సుమారు 240 ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ, EHS , JHS సేవలు బంద్ అయ్యాయి. 1500 కోట్ల బకాయిల చెల్లింపులతో పాటు 2007లో చేసుకున్న MOU, ప్యాకేజీ రేట్స్ సవరణ చేయాలని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి.పేదల ఆరోగ్య ప్రదాయని ఆరోగ్య శ్రీ సేవలు తెలంగాణ రాష్ట్రంలో నిలిచిపోయాయి. ప్రభుత్వం నుంచి 1500 కోట్ల రూపాయల బకాయిలు అందకపోవడంతో ఆరోగ్య శ్రీ సేవలను ప్రైవేటు ఆసుపత్రులు నిలిపివేశాయి. ఈ బకాయిల చెల్లింపులకు ప్రైవేటు ఆసుపత్రుల సంఘం విధించిన గడువు గురువారంతో ముగిసింది. అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో శుక్రవారం నుంచి సేవలు నిలిపివేతకు నిర్ణయించారు.

పేదలకు ఉచితంగా వైద్యం అందించే ఉద్దేశంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం 2007లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీనికింద ప్రతి కుటుంబానికి 2లక్షల రూపాయల మేర వైద్యం అందుతుంది. దీంతో పాటు ఎంప్లాయీస్ హెల్త్ స్కీం, జర్నలిస్టు హెల్త్ స్కీం కూడా ప్రారంభించారు. మొత్తం 940 రకాలకు పైగా అనారోగ్యాలకు ఆరోగ్యశ్రీ కింద సేవలందుతున్నాయి. కార్డియాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, ఆర్డోపెడిక్, ఇతర మేజర్ సర్జరీలు, దీర్ఘకాలిక వ్యాధులకు ఆరోగ్య శ్రీ సేవలందుతున్నాయి. మొత్తం 240 ప్రైవేటు, 96 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ పథకం కింద పేదలకు వైద్య సేవలందుతున్నాయి. 10వేల మంది ఔట్ పేషంట్లు, మూడువేల మంది ఇన్ పేషంట్లు ఈ పథకం కింద వైద్య సేవలు పొందుతున్నారు. బకాయిల చెల్లింపు కోసం ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు చాలాసార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నాయి. సేవలందించడం భారంగా మారిందని ప్రైవేటు ఆసుపత్రుల సంఘం ప్రతినిధులు అంటున్నారు.

బకాయిలు చెల్లించాలన్న డిమాండ్‌తో గతం సంవత్సరం నవంబరులో కూడా ప్రైవేటు ఆసుపత్రులు ఆందోళనకు దిగాయి. ఆ బకాయిలను వెంటనే చెల్లిస్తామంటూ ప్రభుత్వం అప్పట్లో హామీ ఇచ్చింది. కానీ 132 కోట్ల రూపాయలు మాత్రమే ప్రభుత్వం విడుదల చేసింది. తర్వాత మరో 100 కోట్ల రూపాయలు విడుదల చేశారు. మిగిలిన బకాయిల గురించి ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు 1500 కోట్ల రూపాయలకు చేరింది. బకాయిల్లో కనీసం 70శాతమైనా తక్షణం చెల్లించాలని ప్రైవేటు ఆసుపత్రులు డిమాండ్ చేస్తున్నాయి. ఆరోగ్య శ్రీ సేవల బంద్‌, బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఇటు ప్రజలు, అటు ప్రైవేటు ఆసుపత్రులు కోరుతున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories