ప్రేమ కోసం ఆ యువకుడు ఏం చేసాడో తెలుసా?

ప్రేమ కోసం ఆ యువకుడు ఏం చేసాడో తెలుసా?
x
Highlights

ప్రేమ.. ప్రస్తుత సమాజంలో ఎవరినోట విన్నా వినిపించేది ఈ మాటే. ఈ ప్రేమ కొన్ని చరిత్రలను తిరగ రాసింది. ఈ ప్రేమకు గుర్తుగా షాజహాన్ తాజమహల్ ను కట్టిస్తే, అక్బర్ సలీం, అనార్ కలీం వారి ప్రాణాలను వదిలేసారు.

ప్రేమ.. ప్రస్తుత సమాజంలో ఎవరినోట విన్నా వినిపించేది ఈ మాటే. ఈ ప్రేమ కొన్ని చరిత్రలను తిరగ రాసింది. ఈ ప్రేమకు గుర్తుగా షాజహాన్ తాజమహల్ ను కట్టిస్తే, అక్బర్ సలీం, అనార్ కలీం వారి ప్రాణాలను వదిలేసారు. ఇప్పుడు ఇదే తరహాలో ఓ యువకుడు కూడా తన ప్రేమను దక్కించుకోవడానికి వినూత్న ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వారి ప్రేమను ఆ యువతి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించాడు.

యువకుడు తెలిపిన వివరాల్లోకెళితే వికారాబాద్‌ జిల్లాకు చెందిన బొబ్బిలి భాస్కర్‌ అదే పట్టణానికి చెందిన ఒక ముస్లిం యువతిని 11 ఏళ్లుగా ప్రేమిస్తున్నాడని చెప్పారు. ఈ విషయం తెలిసుకున్న యువతి తనను మత మార్పిడి చేసుకుని ముస్లిం మతంలోకి చేరాలని అప్పడయితేనే పెళ్లి చేసుకుంటానని చెప్పిందన్నారు. దీంతో ఆ యువకుడు మత మార్పిడి చేసుకుని మహ్మద్‌ అబ్దుల్‌ హుస్సేన్‌గా పేరు మార్చుకున్నాడని తెలిపారు.

తాను మతం మార్చుకున్న తరువాత కూడా యువతి తల్లిదండ్రులు తమ ప్రేమకు అంగీకరించకపోగా చంపుతామని బెదిరిస్తున్నారని తెలిపారు. ఏది ఏమైనా ఆ యువతినే పెళ్లి చేసుకుంటానని, తాను ప్రేమించిన యువతి తనకు దక్కే విధంగా న్యాయం చేయాలని కోరుతూ హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించినట్లు తెలిపాడు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories