నాకు అతనే కావాలి ... ప్రియుడు కోసం వాటర్ ట్యాంక్ ఎక్కిన ప్రియురాలు ..

నాకు అతనే కావాలి ... ప్రియుడు కోసం వాటర్ ట్యాంక్ ఎక్కిన ప్రియురాలు ..
x
Highlights

ప్రేమ కోసం ఏమైనా చేస్తారు అంటే బహుశా ఇదేనేమో .. ఓ ప్రియురాలు తానూ ప్రేమించిన ప్రియుడి కోసం ఏకంగా వాటర్ ట్యాంక్ ని ఎక్కేసింది .. ఈ సంఘటన తెలంగాణా...

ప్రేమ కోసం ఏమైనా చేస్తారు అంటే బహుశా ఇదేనేమో .. ఓ ప్రియురాలు తానూ ప్రేమించిన ప్రియుడి కోసం ఏకంగా వాటర్ ట్యాంక్ ని ఎక్కేసింది .. ఈ సంఘటన తెలంగాణా రాష్ట్రములోని పెద్దపల్లి జిల్లలో చోటు చేసుకుంది. తన ప్రియుడు తనని మోసం చేసాడని తనకి తన ప్రియుడితో వెంటనే పెళ్లి జరిపించాలని అనుషా అనే యువతీ కోరింది . ఇక వివరాల్లోకి వెళ్తే ..

పెద్దపల్లి జిల్లా అప్పనపేటకు చెందిన అనూషా అనే యువతి శ్రీకాంత్ అనే యువకుడిని ప్రేమించింది. వీరిద్దరూ ఓ గుడిలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారని అయితే కుటుంబ సభ్యుల సమక్షంలో తనను వివాహం చేసుకోవాలని కోరడంతో యువకుడు నిరాకరించాడని అనుషా చెబుతోంది. దీంతో అనూషా వాటర్ ట్యాంక్ ఎక్కింది. విషయం తెలుసుకున్నా పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు . చివరికి శ్రీకాంత్ తో పెళ్లి జరిపిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో అనూషా ట్యాంక్ నుంచి కింద దిగింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories