పాపం.. వర్షం నుంచి రక్షించుకోవడానికి మెట్రో స్టేషన్ నీడలోకి వెళ్లి ప్రాణాలు కోల్పోయింది!

పాపం.. వర్షం నుంచి రక్షించుకోవడానికి మెట్రో స్టేషన్ నీడలోకి వెళ్లి ప్రాణాలు కోల్పోయింది!
x
Highlights

అమీర్‌పేట మెట్రో స్టేషన్‌ ఆవరణలో ప్రమాదం చోటుచేసుకుంది. మెట్రోస్టేషన్‌ పెచ్చులూడి పడడంతో మౌనిక కంతాల అనే మహిళ మృతిచెందింది. వర్షం కారణంగా...

అమీర్‌పేట మెట్రో స్టేషన్‌ ఆవరణలో ప్రమాదం చోటుచేసుకుంది. మెట్రోస్టేషన్‌ పెచ్చులూడి పడడంతో మౌనిక కంతాల అనే మహిళ మృతిచెందింది. వర్షం కారణంగా మెట్రోస్టేషన్‌ కింద నిరీక్షిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందింది. మృతురాలిని కేబీహెచ్‌బీ వాసిగా గుర్తించారు.

వర్షం ఎక్కువగా కురుస్తుండటంతో అమీర్‌పేట మెట్రో స్టేషన్‌‌‌కు వెళ్లే మెట్ల పక్కనే మౌనిక నిలుచుంది. అయితే హఠాత్తుగా పెచ్చులూడి ఆమె తలపై పడ్డాయి. దీంతో ఆమె కుప్పకూలిపోయింది. పక్కనే ఉన్న వారు ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె చనిపోయింది.

హైదరాబాద్‌లోని మెట్రో స్టేషన్లలో అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ పెద్దది. ఇది జంక్షన్ కావడంతో వేలాది మంది నిత్యం ప్రయాణాలు సాగిస్తుంటారు. అలాగే దీని కింద నుంచి నిత్యం వాహనాలు వెళ్తుంటాయి. పాదచారులు ఫుట్‌పాత్‌ పైనుంచి నడుచుకుని వెళ్తుంటారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories