లాక్ డౌన్ సమయంలో ఆకట్టుకుంటున్న విద్యార్ధి

లాక్ డౌన్ సమయంలో ఆకట్టుకుంటున్న విద్యార్ధి
x
shashank
Highlights

కరోనా కట్టడికి దేశమంతాట లాక్ డౌన్ కొనసాగుతోంది. స్కూళ్లకు సెలవులు ఇచ్చారు. టైంపాస్ కాక అధిక మంది విద్యార్థులు కొద్దిసేపు చదువుకుని, అధిక సమయం టీవీలకు...

కరోనా కట్టడికి దేశమంతాట లాక్ డౌన్ కొనసాగుతోంది. స్కూళ్లకు సెలవులు ఇచ్చారు. టైంపాస్ కాక అధిక మంది విద్యార్థులు కొద్దిసేపు చదువుకుని, అధిక సమయం టీవీలకు అంటుకుపోతున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఓ విద్యార్థి ఖాళీ సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నాడు. తన క్రియోటివిటీకి పదును పెడుతున్నాడు. కాగితాలతో అందమైన బొమ్మలు తయారుచేస్తున్నాడు.

నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండలం ఉప్లూర్ గ్రామానికి చెందిన జిందం మారుతి, లతల సంతానం శశాంక్. స్థానిక స్కూల్ లో ఆరో తరగతి చదువుతున్నాడు. కరోనా వ్యాప్తి నిరోధానికి దేశంలో లాక్ డౌన్ విధించారు. విద్యాలయాలకు సెలవులు ఇచ్చారు. దీంతో ఇంట్లో వుంటున్న శశాంక్ ఖాళీ సమయాన్ని వృద్ధా చేయడంలేదు. తనకు ఇష్టమైన బొమ్మలను పేపర్లతో తయారుచేస్తున్నాడు. అంతేకాక చిన్న బ్యాటరీలతో ఎయిర్ కూలర్ , టేబుల్ ల్యాంప్ తదితర పరికరాలు తయారుచేస్తూ చుట్టుపక్కలవారిని అబ్బురపరుస్తున్నాడు. లాక్ డౌన్ లో ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్న శశాంక్ ను చుట్టుపక్కలవారు శభాష్ అని మెచ్చుకుంటున్నారు.

.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories