ప్రధానోపాధ్యాయుడి వక్రబుద్ధి.. కర్తవ్యాన్ని మరిచి పోకిరిలా ప్రవర్తన !

ప్రధానోపాధ్యాయుడి వక్రబుద్ధి.. కర్తవ్యాన్ని మరిచి పోకిరిలా ప్రవర్తన !
x
Highlights

విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు గతి తప్పాడు. తన కర్తవ్యాన్ని మరిచి పోకిరి వెదవలా ప్రవర్తించాడు. కన్న బిడ్డల్లా చూసుకోవాల్సిన విద్యార్థిని...

విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు గతి తప్పాడు. తన కర్తవ్యాన్ని మరిచి పోకిరి వెదవలా ప్రవర్తించాడు. కన్న బిడ్డల్లా చూసుకోవాల్సిన విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. వేధింపుల విషయాన్ని తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసి గదిలో నిర్బంధించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వికారాబాద్‌ జిల్లా నవాబ్‌పేట్‌ మండలం ఆర్కతల ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది.

పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పెద్ద కురువ కిష్టయ్య స్వస్థలం నవాబుపేట మండలం ఖానాపూర్ గ్రామం. 6వ తరగతి చదువుతున్న విద్యార్థిని పట్ల ప్రధానోపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆ విద్యార్థిని విషయాన్ని తన తల్లిదండ్రులకు చేరవేసింది. తీవ్ర ఆగ్రహానికి గురైన విద్యార్థిని తల్లిదండ్రులు ప్రధానోపాధ్యాయుడికి దేహశుద్ధి చేసి రూమ్‌లో నిర్బంధించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తోటి ఉపాధ్యాయులు అతనిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారంటూ విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రధానోపాధ్యాయుడు పెద్ద కురువ కిష్టయ్యను వెంటనే సస్పెండ్ చేయాలని గ్రామస్తులు, విద్యార్థిని తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు. ఘటనపై స్పందించిన డీఈవో రేణుక పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయులను, విద్యార్థి తల్లిదండ్రుల నుంచి వివరాలు సేకరించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories