శిలాఫలకంపై పేరు చిన్నగా ఉందని వాటర్ ట్యాంక్ ఎక్కిన సర్పంచ్..

శిలాఫలకంపై పేరు చిన్నగా ఉందని వాటర్ ట్యాంక్ ఎక్కిన సర్పంచ్..
x
Highlights

ప్రభుత్వ ఆదర్శ పాటశాలలో శిలాఫలకంపై తన పేరు తప్పుగా ఉందని, అందులోను అక్షరాలు చిన్నగా ఉన్నాయని ఓ సర్పంచ్ ఏకంగా వాటర్ ట్యాంక్ ఎక్కినా ఘటన మహబూబాబాద్ లో...

ప్రభుత్వ ఆదర్శ పాటశాలలో శిలాఫలకంపై తన పేరు తప్పుగా ఉందని, అందులోను అక్షరాలు చిన్నగా ఉన్నాయని ఓ సర్పంచ్ ఏకంగా వాటర్ ట్యాంక్ ఎక్కినా ఘటన మహబూబాబాద్ లో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే డోర్నకల్ మండలం చిలుకోడులోని ఓ ప్రభుత్వ పాటశాలలో కొత్తగా వసతిగృహం నిర్మించారు. దాని ప్రారంబోత్సవం సందర్భంగా శిలాఫలకంపై తన పేరు తప్పుగా ఉందని గ్రామా సర్పంచ్ అయిన వెంకటేశ్వరరావు వాటర్ ట్యాంక్ ఎక్కాడు. వెంకటేశ్వరరావు కి బదులుగా వెంకటేశ్వర్లు ఉందని, నన్ను అవమానించాలనే ఇలా చేసారని తన ఆవేదన వ్యక్తం చేసాడు. దీనికితోడు గ్రామస్థులు కూడా ధర్నాకు దిగారు. దీనితో అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. అక్కడికి పోలీసులు చేరుకొని సర్పంచ్ ని మందలించారు. అతను పెట్టిన షరతులను ఒప్పుకోవడంతో సర్పంచ్ శాంతించి కిందికి దిగాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories