ఆ ముగ్గురు.. ఏం చేసారో తెలుసా?

ఆ ముగ్గురు.. ఏం చేసారో తెలుసా?
x
Highlights

ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ తమకు కావలసిన వస్తువులను వేటినైనా సరే ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ ఇండియానే కొనుగోలు చేస్తున్నారు.

ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ తమకు కావలసిన వస్తువులను వేటినైనా సరే ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ ఇండియానే కొనుగోలు చేస్తున్నారు. అంతే కాదు వచ్చిన వస్తువులు రిటర్న్ చేసే సదుపాయాన్ని కూడా కల్పించింది. దాన్ని అవకాశంగా తీసుకున్న కొంత మంది యువకులు అమేజాన్ సంస్థనే మోసం చేసారు.

పూర్తివివరాల్లోకెళితే జాగిత్యాల పట్టణానికి చెందిన కట్ట అరుణ్‌ కాంత్‌, వేణుమాధవ్‌, మొహసిన్‌లు అమెజాన్‌ ఆన్‌లైన్‌ లో వస్తువులను కొనుగోలు చేసేవారు. అలా మొత్తం రూ. 8లక్షల విలువైన వస్తువులను కొనుగోలు చేసారు. ఆ తరువాత అమేజాన్ నుంచి వచ్చిన వస్తువులను తీసుకుని వచ్చిన వస్తువులు బాగా లేవని అనేక కారణాలు చెప్పి ఖాలీ డబ్బాలలో నకిలీ వస్తువులను పెట్టి అమెజాన్‌కు తిప్పి పంపించారు.

ఇన్ని లక్షల వస్తువులు తిరిగి రావడంతో అనుమానం వచ్చిన అమెజాన్‌ ప్రతినిధులు డబ్బాలను తెరిచి చూసి ఒక్క సారిగా వారు విస్తుపోయారు. అందులో ఉన్నవి నకిలీ వస్తువులని తెలిసి, తాము మోసపోయామని గ్రహించి అమెజాన్ లీగల్ టీం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఆ ముగ్గురు యువకులని అదుపులోకి తీసుకొని సెక్షన్‌ 406,420 కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories