పెళ్లి అయిన రెండు నెలలకే నవవధువు ఆత్మహత్య

పెళ్లి అయిన రెండు నెలలకే నవవధువు ఆత్మహత్య
x
Highlights

పెళ్లి అయి రెండు నెలలు మాత్రమే అవుతుంది. పాపం ఎం కష్టం వచ్చిందో ఏమో కానీ ఆత్మహత్య చేసుకుంది ఆ నవవధువు. ఈ సంఘటన హైదరాబాదులోని వనస్థలిపురంలో...

పెళ్లి అయి రెండు నెలలు మాత్రమే అవుతుంది. పాపం ఎం కష్టం వచ్చిందో ఏమో కానీ ఆత్మహత్య చేసుకుంది ఆ నవవధువు. ఈ సంఘటన హైదరాబాదులోని వనస్థలిపురంలో శుక్రవారం చోటుచేసుకుంది. దీనిపైన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వనస్థలిపురం శ్రీనివాసపురం కాలనీకి చెందిన సోమవరం సంతోష్‌ కి మలక్‌పేటకు చెందిన పల్లవి(28)తో గత ఏడాది డిసెంబర్ 8 న వివాహం జరిగింది.

పని నిమిత్తం భర్త సంతోష్ బయటకు వెళ్ళగా, అత్తమామలు ఆస్పత్రికి వెళ్లారు. ఈ నేపధ్యంలో పల్లవి ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆసుపత్రికి వెళ్ళిన అత్తమామలు కోడలు పల్లవికి ఫోన్ చేయగా ఎంతకు ఫోన్ తీయకపోవడంతో పక్కింటి వాళ్ళకి ఫోన్ చేసి పల్లవిని పిలవమని సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో గదిలో పల్లవి ఫ్యాన్‌కు ఉరి వేసుకొని కనిపించడంతో వెంటనే పల్లవి చనిపోయిందని ఆమె భర్తకి, అత్తమామలకి సమాచారం అందించారు. ఆమె ఆత్మహత్యకి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories