Top
logo

మానవత్వం చాటుకున్న దివ్యాంగుడు : ప్రశంసించిన కేటీఆర్

మానవత్వం చాటుకున్న దివ్యాంగుడు : ప్రశంసించిన కేటీఆర్
Highlights

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఇప్పటికే 195 దేశాలకి ఈ వ్యాధి సోకింది.

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఇప్పటికే 195 దేశాలకి ఈ వ్యాధి సోకింది.దేశవ్యాప్తంగా కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఇప్పటికే 195 దేశాలకి ఈ వ్యాధి సోకింది. ఈ వ్యాధి వలన భారత్‌లో 724 కరోనా కేసులు నమోదు కాగా, 17 మంది మృతి చెందారు.. దీనిని అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటు ముందుకు వెళ్తున్నాయి. ఇందులో భాగంగానే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లక్షా డెబ్బై వేల కోట్ల కరోనా రిలీఫ్ ప్యాకేజీని ప్రకటించారు. ఇక ప్రభుత్వాలతో పాటుగానే సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు తమకి తోచినంతగా విరాళాలను అందజేస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార ప్రముఖులు తమకు చేతనైనంత విరాళం అంజేశారు. వారితో పాటుగానే సామాన్య రైతులు, చిన్న ఉద్యోగులు కూడా వారి స్థోమతలో వారు విరాళాలు అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మొన్నటికి మొన్న ఓ సన్నకారు రైతు రూ.50వేలను రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందజేస్తే, ఈ రోజు ఓ దివ్యాంగుడు తన నెల పింఛన్ ను విరాళంగా అందజేసారు.

పూర్తివివారల్లోకెళితే కొమురంభీం జిల్లా కాగజ్‌నగర్‌ పట్టణం బాలాజీనగర్‌ లో బండివాసు అనే దివ్యాంగుడు నివాసముంటున్నాడు. ఇతను కరోనా బాధితుల సహాయార్థం తన ఒక నెల పెన్షన్‌ రూ.3016 ను సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు పంపించి తన ఔదార్యాన్ని చాటుకున్నాడు. ఈ విషయాన్ని బండివాసు తన ట్విటర్ ద్వారా మంత్రి కేటీఆర్‌ కు, సినీ హీరో రాంచరణ్‌ కు ట్యాగ్‌ చేశాడు. దీంతో మంత్రి కేటీఆర్ స్పందిస్తూ దివ్యాంగుడు చేసిన ఈ పనిని అద్భుతమని కొనియాడారు. హీరో రామ్‌చరణ్‌ కూడా ఈ విషయంపై స్పందించి బండివాసును కొనియాడారు. వాసు ఈ విరాళాన్ని అందించి శారీరకంగా దివ్యాంగుడైనప్పటికీ మానసికంగా కాదు అని నిరూపించుకున్నాడు. ఇతను ఒక్కడు మాత్రమే కాదు మానవత్వం ఉన్న ఎంతో మంది ఇలాంటి ఆపద సమయంలో తమ ఔదార్యాన్ని చాటుకుంటున్నారు.

Web TitleA man from Balajinagar donates his monthly pension to the CM relief fund
Next Story