''మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు'': కళ్ళముందే గిల గిల లాడుడతున్నా..కనికరించలేదు!

మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు: కళ్ళముందే గిల గిల లాడుడతున్నా..కనికరించలేదు!
x
Highlights

మనిషన్నవాడు మాయమవుతున్నాడు. ఇది బాధగా పాడుకునే పాట కాదు... నిజ జీవితంలో కూడా కనిపిస్తున్న ఆట. అవును కరీంనగర్‌ నడీబొడ్డున జరిగిన ఒక ఘటన సమాజంలో మనిషి...

మనిషన్నవాడు మాయమవుతున్నాడు. ఇది బాధగా పాడుకునే పాట కాదు... నిజ జీవితంలో కూడా కనిపిస్తున్న ఆట. అవును కరీంనగర్‌ నడీబొడ్డున జరిగిన ఒక ఘటన సమాజంలో మనిషి పాత్రను ప్రశ్నిస్తోంది. అందరూ చూస్తుండగానే, కళ్ల ముందే ఒక వ్యక్తి ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్న పట్టించుకోని మనుషులు చివరకు అతను ప్రాణాలు కోల్పోయినా స్పందించలేదు.

అవును నిజమే! మనిషన్న వాడు మాయమైపోతున్నాడు. మానవత్వాన్ని మరిచి ప్రవర్తిస్తున్నాడు. అరణ్యంలో ఉన్నమా జనారణ్యంలో ఉన్నామా అర్థం కాని స్థితికి చేరుకుంటున్నాడు. చుట్టూ జనం ఉన్నా తమ కళ్ల ముందే ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోతున్నా పట్టించుకోని దైన్యాన్ని ఏమనాలి.

కరీంనగర్ పట్టణంలోని నడిబొడ్డున ఉన్న మార్కెట్ ప్రాంతం. చుట్టూ వందలాది మంది ఉన్నారు. వందల సంఖ్యలో మార్కెట్‌కు వచ్చి పోతూ ఉంటారు. చుట్టూ ఉన్నది మనుషులే కానీ కారడవిలో ఉన్నట్టే ఉంది. చేపల మార్కెట్‌ దగ్గరలోనే ఉన్న ఓ టిఫిన్ సెంటర్‌లో నిజామాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి టిఫిన్ చేశాడు. అప్పటి వరకు కళ్ల ముందే టిఫిన్ చేస్తున్న ఇతను బయటికి వస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు ప్రాణం కోసం గిలగిలా కొట్టుకుంటూ దీనంగా సహాయం కోసం ఎదురు చూశాడు.

అంత దీనావస్థలోనూ ఏ ఒక్కరు సహాయం చేసేందుకు కదలిరాలేదు. ఒక చెయ్యి ముందుకు రాలేదు. పైగా అక్కడ జరుగుతున్నది ఏదో అన్నట్టుగా అంతా ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటూ అక్కడే ప్రాణాలు వదిలిన ఆ మనిషిని వింతగా చూస్తూ ఉండిపోయారు. అంతలో ఒక వ్యక్తి వచ్చి గుండెలపై గట్టిగా కొడుతూ బతికించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండాపోయింది. ఎందుకంటే అప్పటికే అతను కన్నుమూశాడు పాపం.

చివరకు చనిపోయిన వ్యక్తి నిజామాబాద్ జిల్లాకు చెందిన శనిగరం అంజిగా గుర్తించారు పోలీసులు. ఐదేళ్ల క్రితం తల్లిదండ్రులు చనిపోవడంతో మానసికంగా బాగా ఇబ్బంది పడుతున్నాడు. ఆ వేదనతోనే గుండె నొప్పి వచ్చి ఉంటుందని ఒక అంచనా వచ్చారు. ఏమైనా కింద పడిన వెంటనే ఎవరైనా వచ్చి రక్షించి ఉంటే పరిస్థితి వేరోలా ఉండేదేమో.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories