ఇదో వింత జబ్బు..చెమట రూపంలో రక్తం

ఇదో వింత జబ్బు..చెమట రూపంలో రక్తం
x
Highlights

ఎవరికైనా పరిగెత్తినా, నడిచినా, ఉక్కపోసినా చెమట నీరు రూపంలో వస్తుంది. కానీ ఈ యువకుడికి మాత్రం అదేంటో చెమట రక్తం రూపంలో వచ్చేది. రోజుకు పది నుంచి 15...

ఎవరికైనా పరిగెత్తినా, నడిచినా, ఉక్కపోసినా చెమట నీరు రూపంలో వస్తుంది. కానీ ఈ యువకుడికి మాత్రం అదేంటో చెమట రక్తం రూపంలో వచ్చేది. రోజుకు పది నుంచి 15 సార్లు ఈ విధంగా రక్తం తన ఒంట్లోనుంచి వస్తే చాలు పాపం ఆ యువకుడు ఎంతో నరకం అనుభవించేవాడు. అదికూడా శరీరంలో ఒక్క భాగం నుంచి మాత్రమే కాదు ముఖం, చెక్కిళ్లు, కాళ్లు, చేతులూ ఇలా వివిధ శరీర అవయవాల నుంచి రక్తం ధారలుగా కారేది. దీంతో ఆ యువకుడి తల్లిదండ్రులు హైదరాబాద్‌లో పలు ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స చేపించి లక్షలకు, లక్షలు ఖర్చు చేసుకున్నారు. అయినా ఆ ఫలితం దక్కకపోవడంతో ఆ తల్లిదండ్రులు నిరాశపాలయ్యారు. అసలు ఈ విద్యార్థికి ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు శరీరభాగాల నుంచి రక్త శ్రావం జరుగుంది అన్న విషయాన్ని ఏ ఒక్క వైద్యుడు కూడా కనిపెట్టలేక పోయారు.

పూర్తి వివరాల్లోకెళితే నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం పోరెడ్డిగూడేనికి చెందిన వి వెంకట్‌ రెడ్డి కుమారుడు శంకర్‌ రెడ్డి (11)కి మనిషికి చెమట కారినట్టుగా శరీర భాగాల నుంచి రక్తం కారేది. ఈ బాలుడికి 2017 సంవత్సరం ఆగస్టునెల నుంచి ఈ వ్యాధి ప్రారంభమైంది. దీంతో అతని తల్లిదండ్రులు ఆ బాలుడిని నల్లగొండలోని ఆస్పత్రులు మాత్రమే కాకుండా హైదరాబాద్ నగరంలోని పెద్ద పెద్ద హాస్పటల్లు కూడా తిరిగారు. అయినప్పటికీ ఫలితం లేదు, కనీసం ఆ వ్యాధి పేరేంటో కూడా కనుక్కోలేకపోయారు.

దీంతో ఓ వైద్యుడు ఆ వ్యాధి గురించి కనిపెట్టడానికి ఎంతో కృషి చేసాడు. చివరకు అతనికి చికిత్స అందించడం ప్రారంభించాడు. నల్గొండ జిల్లా పోరెడ్డిగూడేనికి చెందిన డాక్టర్ సురేశ్ రెడ్డి జిల్లా జనరల్‌ ఆస్పత్రిలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఈయనను 2018 డిసెంబర్‌లో బాలుడి తండ్రి కలిసి వ్యాధి గురించి వివరించారు. దీంతో బాలుడికి వైద్యుడు ఆస్పత్రిలో వివిధ పరీక్షలు నిర్వహించారు. అనంతరం రిపోర్టులను అన్నింటిని పరిశీలించి, చివరికి ఆ వ్యాధి గురించి వైద్య రంగానికి సంబంధించిన పదజాలంతో గూగుల్ లో సెర్చ్ చేసి వ్యాధి వివరాలను సేకరించారు.

అది ఒక అరుదైన వ్యాధి అని దాన్ని 'స్వెటింగ్ బ్లడ్', హెమటైడ్రోసిస్‌ అనే పేరుతో పిలుస్తారని తెలిపారు. అనంతరం ఆ వ్యాధి నివారణకు చికిత్స వివరాలనుకూడా సేకరించాడు. ఈ వ్యాధి యుక్త వయసులోకి ప్రవేశించే బాలురలో వచ్చే అరుదైన వ్యాధి అని డాక్టర్ సురేశ్ రెడ్డి తెలిపారు. కోట్ల మందిలో ఒక్కరికి ఇలాంటి వ్యాధి వస్తుందని ఆయన వివరించారు. తరువాత ఆ బాలుడిని తన ఆస్పత్రిలో చేర్చుకుని చికిత్స ప్రారంభించారు. దాంతో ఆ యువకుడు మంచిగా కోలుకుంటున్నాడని తెలిపారు. దీంతో అతడి తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories