Top
logo

నిజామాబాద్ జిల్లాలో ఎలుగుబంటి బీభత్సం

నిజామాబాద్ జిల్లాలో ఎలుగుబంటి బీభత్సం
Highlights

నిజామాబాద్ జిల్లా ధర్మారంలో బీభత్సం సృష్టించిన ఎలుగుబంటిని అటవీ శాఖ అధికారులు బంధించారు. గ్రామస్తులపై...

నిజామాబాద్ జిల్లా ధర్మారంలో బీభత్సం సృష్టించిన ఎలుగుబంటిని అటవీ శాఖ అధికారులు బంధించారు. గ్రామస్తులపై ఎలుగుబంటి దాడి చేసి నలుగురిని గాయపర్చింది. ఎలుగుబంటి సంచారంతో భయందోళన చెందిన గ్రామస్తులు అటవీ శాఖ అదికారులకు సమాచారం అందించారు. గ్రామస్తులు తరిమికొట్టడంతో ఎలుగు బంటి పారిపోయింది. అటవీ అధికారులు ఎలుగుబంటి కోసం పది గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. చివరకు మరో ప్రాంతంలో ఎలుగుబంటిని గుర్తించారు. మత్తు మందు ఇచ్చి ఎలుగుబంటిని బోన్ లో బందించడంతో గ్రామస్థులు ఊపరి పీల్చుకున్నారు.లైవ్ టీవి


Share it
Top