లంచం తీసుకున్న ఆరుగురు పోలీస్ అధికారుల సస్సెండ్

లంచం తీసుకున్న ఆరుగురు పోలీస్ అధికారుల సస్సెండ్
x
Highlights

హుక్కా సెంటర్ల యజమానుల నుండి లంచం తీసుకున్నందుకు పోలీస్ కమిషనర్ అంజని కుమార్ 6గురు పోలీస్ అధికారులను సస్సెండ్ చేశారు.

లంచం తీసుకుంటున్న 6గురు పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. హుక్కా సెంటర్ల యజమానుల నుండి లంచం తీసుకున్నందుకు గాను నగర పోలీసు కమిషనర్ అంజని కుమార్ వారిని బుధవారం సస్పెండ్ చేశారు. అకస్మిక సోదాలకు సంబంధించి ముందస్తు సమాచారాన్ని హుక్కా సెంటర్ యజమానులకు ఇస్తూ వారి నుంచి భారీగా డబ్బులు తీసుకున్నారని సీపీ అంజనీకుమార్‌కు ఫిర్యాదు అందింది. ఈ విషయంపై విచారణ జరిపించిన సీపీ పూర్తి ఆధారాలను సేకరించారు. అనంతరం ఆ ఆరుగురు అధికారుల మీద చర్యలు తీసుకుని వారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

సస్పెండ్ అయిన వారిలో షాహినాయత్‌గంజ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్సై ఎస్ కురుమూర్తి, మహాంకలి పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్సై డి శ్రీను, వెస్ట్ జోన్‌కు చెందిన ఎస్సై ఇ శంకర్, ప్రత్యేక శాఖ నుంచి ఎస్సై రామకృష్ణ, జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఏఎస్సై మహ్మద్ జాఫర్, శామ్యూల్ ఉన్నారు. ఒకేసారి ఆరుగురు అధికారులపై సస్పెన్షన్ వేటు పడడంతో పోలీసు వర్గాల్లో ఆందోళన మొదలయింది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories