Top
logo

తెలంగాణ పోలీసు శాఖలో కరోనా కలకలం

తెలంగాణ పోలీసు శాఖలో కరోనా కలకలం
X
Highlights

తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. తెలంగాణ పోలీసు శాఖలో కరోనా కలకలం సృష్టించింది. హైదరాబాద్ ...

తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. తెలంగాణ పోలీసు శాఖలో కరోనా కలకలం సృష్టించింది. హైదరాబాద్ లో ఇప్పటికే ఆరుగురు పోలీసులు కరోనా బారీన పడ్డారు. మొదటగా కొత్తగూడెం డీఎస్పీ కరోనా బారీనా పడగా హైదరాబాద్ కుల్సుంపురా పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ కి కోవిడ్ సోకడంతో మృతి చెందారు.

వలస కార్మికులను స్వస్థలాలకు పంపించడంలో చురుగ్గా పని చేసిన ఇన్ స్పెక్టర్ కి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. గాంధీ ఆసుపత్రిలో పని చేసే ఓ ఎస్సై , కానిస్టేబుల్ కి కరోనా సోకింది. మరో కానిస్టేబుల్ కూడా గాంధీలోని క్విక్ రెస్పాన్స్ టీంలో పని చేస్తున్నట్లు సమాచారం. బొల్లారం, బోయిన పల్లి పీఎస్ లో పని చేస్తున్న మరో ఇద్దరు కానిస్టేబుల్స్ కి కరోనా సోకినట్ల తెలుస్తోంది. కరోనా లక్షణాలు ఉన్న పోలీసులను గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Web Title6 police infected coronavirus in Telangana
Next Story