Top
logo

తెలంగాణలో మరో భారీ థర్మల్ విద్యుత్ కేంద్రం

తెలంగాణలో మరో భారీ థర్మల్ విద్యుత్ కేంద్రం
Highlights

300 మెగావాట్ల ప్రైవేట్ థర్మల్ విద్యుత్ ప్రాజెక్టును తెలంగాణలోని సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం వెల్లటూరు గ్రామం వద్ద ఏర్పాటు

300 మెగావాట్ల ప్రైవేట్ థర్మల్ విద్యుత్ ప్రాజెక్టును తెలంగాణలోని సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం వెల్లటూరు గ్రామం వద్ద ఏర్పాటు చేయాలనీ మెక్‌వెల్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతిపాదించింది. ఈ థర్మల్ ప్రాజెక్టులో ఉత్పత్తి అయిన విద్యుత్ మొత్తం తెలంగాణ రాష్ట్ర అవసరాల కోసమే వాడుకునేలా దీన్ని రూపొందిస్తున్నారు. ఈ మేరకు డీపీఆర్‌ను రాష్ట్ర స్థాయి పర్యావరణ ప్రభావ మదింపు అథారిటీకి సమర్పించారు. ఆ తర్వాత పర్యావరణ అనుమతి కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపుతారు. ఒక్కొక్కటి 150 మెగావాట్ల రెండు యూనిట్లతో రూపొందించబడిన ఈ ప్రాజెక్ట్ 332 ఎకరాలలో రూ. 2,160 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేస్తారు.

పులిచింతల హైడల్ డ్యామ్ ప్రాజెక్టు వద్ద ఉన్న 220 కేవీఏ ట్రాన్స్ ఫార్మర్ ద్వారా ఈ విద్యుత్‌ను తెలంగాణ రాష్ట్ర అవసరాల కోసం వినియోగిస్తారు. మొదటి దశ ప్రాజెక్టును అనుమతులు వచ్చిన 27 నెలల్లోనే పూర్తి చేస్తారు. రెండవ దశను మూడు నెలల వ్యవధిలో ప్రారంభిస్తారు. ఈ మొత్తం ప్రాజెక్టులో 12 నిర్మాణ ఒప్పందాలు, సాంకేతిక ఒప్పందాలు ఉంటాయి. రాష్ట్రంలో ఉన్న విద్యుత్ డిమాండ్ ను ఏడాదికి ఆరు శాతంగా లెక్కించి ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. ఈ విద్యుత్ ప్రాజెక్టు అవసరమైన బొగ్గును సింగరేణి కాలరీస్ నుంచి, అంతర్జాతీయ బొగ్గు అమ్మకందార్ల నుంచి ఏడాదికి 2.01 మిలియన్ టన్నులను కొనుగోలు చేయాలని ప్రతిపాదించారు.

Web Title300 MW private power project mooted at Suryapet
Next Story


లైవ్ టీవి