Top
logo

రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలో2 కే రన్

రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలో2 కే రన్
Highlights

♦ ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఉపాధ్యాయ ఐక్యవేదిక ఆధ్వర్యంలో 2కే రన్ ♦ అంబేద్కర్ విగ్రహం నుంచి గాంధీ విగ్రహం వరకు రన్ ♦ ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్

ఆర్టీసీ కార్మికులు వారి హక్కుల సాధన కోసం చేస్తున్న సమ్మె 16వ రోజుకు చేరుకుంది. దీంతో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఉపాద్యాయ ఐక్యవేదిక ఆద్వర్యంలో 2 కే రన్ నిర్వహించారు.

అంబేద్కర్ విగ్రహం నుంచి గాంధీ విగ్రహం వరకు 2 కే రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయని అనుకున్నామని కానీ కేసీఆర్‌ ప్రభుత్వంలో కార్మికుల పట్ల నిర్లక్ష్యం వహించడం సరికాదన్నారు.Next Story