తెలంగాణ, ఏపీలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో సర్వే..

తెలంగాణ, ఏపీలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో సర్వే..
x
Highlights

సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పలు రాష్ట్రాల్లో వివిధ సంస్థలు సర్వే నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో టైమ్స్‌ నౌ-వీఎంఆర్‌ సంస్థలు సంయుక్తంగా...

సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పలు రాష్ట్రాల్లో వివిధ సంస్థలు సర్వే నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో టైమ్స్‌ నౌ-వీఎంఆర్‌ సంస్థలు సంయుక్తంగా దేశవ్యాప్తంగా సర్వే చేపట్టాయి. ఇందులో తెలంగాణలో అధికార టీఆరెస్, ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ హవా కొనసాగుతుందని వెల్లడించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలంగాణాలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు గాను 10 టీఆరెస్, కాంగ్రెస్ 5 , బీజేపీ 0- 1, ఇతరులు 1 గెలుకుంటాయని వెల్లడించింది.

అలాగే ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 25 లోక్‌సభ స్థానాలకుగాను వైఎస్సార్‌సీపీకి 23, టీడీపీ 2 సీట్లు దక్కుతాయని వెల్లడించింది. అటు జాతీయపార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌లు ఒక్క స్థానంలో కూడా గెలవలేవని తెలిపింది. కాగా 2014 లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేయగా ఏపీలో టీడీపీకి 15 సీట్లు, బీజేపీకి రెండు సీట్లు రావడం తెలిసిందే. ఆ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి 8 స్థానాలు దక్కాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories