మాస్కులు వాడని 200 మందికి జరిమానా

మాస్కులు వాడని 200 మందికి జరిమానా
x
Highlights

చైనాలోని వ్యూహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచదేశాలకి విస్తరించి విలయతాండవం చేస్తోంది. ప్రస్తుతం దీనిని అరికట్టడానికి ప్రపంచదేశాలు లాక్ డౌన్ విధించాయి.

చైనాలోని వ్యూహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచదేశాలకి విస్తరించి విలయతాండవం చేస్తోంది. ప్రస్తుతం దీనిని అరికట్టడానికి ప్రపంచదేశాలు లాక్ డౌన్ విధించాయి. ఇక శాస్త్రవేత్తలు కూడా ఈ మహమ్మారి వైరస్ కి వ్యాక్సిన్ ని కనిపెట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అయితే దీనికి నివారణ ముఖ్యమని తెలుపుతున్నారు. ఇక కరోనా కట్టడికి మాస్కులు ధరించాలని, చేతులను శుభ్రంగా కడుక్కోవాలని, వ్యక్తిగత శుభ్రత ముఖ్యమని చెబుతున్నారు. కానీ కొందరు ఇవేమీ పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు.

ఇక లాక్‌ డౌన్‌ సమయంలో ఇంటినుంచి ఒక్కరు మాత్రమే బయటకు రావాలని, బయటకు వచ్చినప్పుడు కచ్చితంగా మాస్క్ లు ధరించాలని, సమాజీక దూరం పాటించాలని చెబుతున్నప్పటికీ కొందరు పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిని సంగారెడ్డి తహసీల్దార్‌ స్వామి పరిశీలించారు. ఈ క్రమంలో మాస్కులు ధరించని వారికి ఒక్కొక్కరికి రూ.100 జరిమానా విధించారు. గురువారం ఒక్కరోజే 100 మందికి జరిమానాలు విధించడం విశేషం...

ఇక కరోనా పై ప్రభుత్వ విధించిన ఆదేశాలను పట్టించుకోకుండా తిరుగుతున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాస్కులు లేకుండా పళ్లు విక్రయిస్తున్న వారిని మందలించారు. మెడికల్, నిత్యావసర వస్తువులను ఇంటికే అందించేందుకు ఏర్పాట్లు చేశామని తహసీల్దార్‌ తెలిపారు. అప్నా చోటు యాప్‌ ద్వారా ప్రజలు నిత్యవసర సేవలు పొందవచ్చని పేర్కొన్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ శరత్‌చంద్ర నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో గురువారం కూరగాయల మార్కెట్‌తో సహా పాత బస్టాండ్‌ పరిసర ప్రాంతాల్లో మున్సిపల్‌ సిబ్బంది పర్యటించి మాస్కులు లేకుండా కనిపించిన వంద మందికి రూ.100 ఫైన్‌ విధించారు.

ఇక తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 700కి చేరింది. ఇక రాష్ట్రంలో 18 మంది మృతి చెందారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories