Top
logo

నిజామాబాద్ ఎంపీ స్థానానికి 179 మంది రైతుల నామినేషన్

నిజామాబాద్ ఎంపీ స్థానానికి 179 మంది రైతుల నామినేషన్
X
Highlights

ఈసారి రాజకీయనాయకుల తోపాటుగా రైతులు కూడా పెద్దఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. అది ఒకే జిల్లాలో ఎంపీ స్థానానికి ...

ఈసారి రాజకీయనాయకుల తోపాటుగా రైతులు కూడా పెద్దఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. అది ఒకే జిల్లాలో ఎంపీ స్థానానికి ఎక్కువమంది రైతులు నామినేషన్లు దాఖలు చేశారు. నిజామాబాద్‌ ఎంపీ స్థానానికి చివరి రోజు ఏకంగా 182 నామినేషన్లు దాఖలు కాగా.. ఇందులో 179 మంది రైతులే ఉన్నారు. తమ

సమస్యలను ప్రభుత్వాలు గుర్తించని కారణంగా తామే తమ సమస్యలను పరిష్కరించుకోవాలన్న ఉద్దేశ్యంతో నామినేషన్లు ఎన్నికల బరిలో నిలిచినట్టు వారు అంటున్నారు. ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలని, పసుపు, ఎర్రజొన్నను ప్రభు త్వమే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. పెద్ద ఎత్తున రైతులు తరలిరావడంతో నిజామాబాద్‌ కలెక్టరేట్‌ పరిసరాలు కిటకిటలాడాయి. కాగా, ఈనెల 20న ఏడు నామినేషన్లు, 22న 56 మంది అభ్యర్థుల నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం మీద నిజామాబాద్‌ లోక్‌సభ స్థానానికి 245 నామినేషన్లు దాఖలైనట్టు ఎన్నికల కమిషన్ వెల్లడించింది.

Next Story