ఒకే ముహూర్తంలో ఒక్కటైన 165 జంటలు

ఒకే ముహూర్తంలో ఒక్కటైన 165 జంటలు
x
Highlights

పెళ్లి చేయాలంటే చాలా ఖర్చులు ఉంటాయి. అందులోనూ ఆడపిల్ల పెళ్లంటే కట్నాలు, కానుకలు, లాంఛనాలు ఇలా చాలా ఉంటాయి.

పెళ్లి చేయాలంటే చాలా ఖర్చులు ఉంటాయి. అందులోనూ ఆడపిల్ల పెళ్లంటే కట్నాలు, కానుకలు, లాంఛనాలు ఇలా చాలా ఉంటాయి. ఇవన్నీ పేదింటి వారు చేయాలంటే వారు ఆర్థికంగా చాలా వెనుక బడి ఉంటారు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న ఎంజేఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ వారు ఒక మంచి పనికి శ్రీకారం చుట్టారు. గత ఏడేండ్లుగా సామూహిక వివాహాలను జరిపిస్తూనే ఉన్నారు. ఇదే కోణంలో ఈ ఏడాది కూడా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒకే ముహూర్తంలో 165 జంటలను ఒక్కటి చేశారు. నాగర్ కర్నూల్ లోని జెడ్పీ మైదానంలో ఇంతటి శుభకార్యాన్ని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తన చేతుల మీదుగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మంత్రి హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ..ఆడపిల్ల పెళ్లి చేయడమంటే ఎంత కష్టమో సీఎం కేసీఆర్ కు తెలుసని, అందుకే, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమలుచేశారని అన్నారు. మంచి పనికి భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడూ వుంటాయని ఆయన తెలిపారు. కుటుంబ వ్యవస్థకు పునాది వివాహం అని అన్నారు.

ఈ సామూహి వివాహ కార్యక్రమానికి విచ్చేసిన వధూవరుల బంధువులకు భోజన ఏర్పాట్లను కూడాచేశారు. అనంతరం నూతన జంటలకు కానుకలను మర్రి జనార్దన్ రెడ్డి అందజేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories