Coronavirus: వరంగల్‌లో పదేళ్ల పాపకు కరోనా పాజిటివ్

Coronavirus: వరంగల్‌లో పదేళ్ల పాపకు కరోనా పాజిటివ్
x
Highlights

వరంగల్‌లో పదేళ్ల చిన్నారికి కరోనా వైరస్ సోకింది. పూరిగుట్ట ప్రాంతానికి చెందిన చిన్నారికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని వరంగల్ డీఎంహెచ్‌వో లలితా దేవీ...

వరంగల్‌లో పదేళ్ల చిన్నారికి కరోనా వైరస్ సోకింది. పూరిగుట్ట ప్రాంతానికి చెందిన చిన్నారికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని వరంగల్ డీఎంహెచ్‌వో లలితా దేవీ ప్రకటించారు. దీనికి సంబంధించి ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. దీంతో పాజిటివ్ వచ్చిన చిన్నారిని హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు వివరించారు. అలాగే పూరిగుట్ట ప్రాంతాన్ని కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. ఆ ప్రాంతంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. బాలిక కుటుంబ సభ్యులు, సన్నిహితులను గుర్తించి ఇప్పటికే వారందరినీ క్వారంటైన్‌కు తరలించారు. అయితే పాజిటివ్ వచ్చిన ఇంకా ఎవరెవరిని కలిసిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories