Rs.1O కాయిన్ నిషేధం..?

Rs.1O కాయిన్ నిషేధం..?
x
Highlights

పది రూపాయల నాణెం చలామణిపై అపోహలు వీడటం లేదు కొంత కాలంగా పది రూపాయల నాణాలు చెల్లడం లేదు. చిన్న దుకాణదారుల నుంచి పెద్ద షాపుల యజమానుల వరకు ఈ నాణాలను...

పది రూపాయల నాణెం చలామణిపై అపోహలు వీడటం లేదు కొంత కాలంగా పది రూపాయల నాణాలు చెల్లడం లేదు. చిన్న దుకాణదారుల నుంచి పెద్ద షాపుల యజమానుల వరకు ఈ నాణాలను తీరస్కరిస్తున్నారు. ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తే చెల్లవంటున్నారు. ఇంతకు పది రూపాయల నాణెం నిషేధించారా చలమణిలో ఉన్నాయా అన్నది బ్యాంకులు కూడా స్పష్టంగా ప్రకటించకపోవడంతో ప్రజలు అయోమయ పడుతున్నారు.

పది రూపాయల నాణాల చలామణిపై ప్రజల్లో సందిగ్ధత నెలకొన్నది. పది రూపాయల నాణాలు చెల్లుబాటు కావడం లేదు. అధికారికంగా నాణెం చలామణిపై ఎటువంటి ప్రకటన రానప్పటికీ ఎవరూ తీసుకోవడం లేదు కొందరు వ్యాపారస్తులు ప్రజల నుంచి తీసుకొని బ్యాంకుల్లో మార్చుకోవచ్చనుకున్న వాళ్లకు చుక్కెదురవుతోంది పెద్ద మొత్తంలో నాణాలు తీసుకునేందుకు బ్యాంకు అధికారులు నిరాకరిస్తున్నారని వ్యాపారస్తులు వాపోతున్నారు.

పది రూపాయల కాయిన్ అనధికార నిషేదంతో ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అవసరాన్ని బట్టి మార్చుకోవచ్చని చెబుతున్నా రూమర్స్ తో ఎవరూ తీసుకోవడం లేదు. పది రూపాయల నాణెం చలామణిపై బ్యాంక్ అధికారులు ప్రకటన చేయాలని కోరుతున్నారు.

మరో వైపు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల నుంచి పది రూపాయల నాణాలు తీసుకుంటున్నా కొంత మంది కండక్టర్లు మాత్రం నిరాకరిస్తున్నారు. అయితే ప్రయాణికులకు చిల్లర సర్ధుబాటు చేసే క్రమంలో కండక్టర్లు ఇస్తే స్వీకరించడంలేదు. పది రూపాయల నాణెం విషయంలో బ్యాంకులు చొరవ చూపి విస్తృతంగా ప్రచారం చేస్తే తప్ప అనధికార నిషేదానికి అడ్డుకట్ట పడేట్టు లేదు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories