100 మంది.. రూ.30 రూపాయల కూలీకి..

100 మంది.. రూ.30 రూపాయల కూలీకి..
x
Highlights

దేశానికి వెన్నుముకగా చెప్పుకునే రైతుకు కష్టాలు ఎదురయ్యాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో అన్నదాతను పుట్టెడు కష్టాలు వెంటాడుతుంటే పనులు దొరక్క కూలీలు...

దేశానికి వెన్నుముకగా చెప్పుకునే రైతుకు కష్టాలు ఎదురయ్యాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో అన్నదాతను పుట్టెడు కష్టాలు వెంటాడుతుంటే పనులు దొరక్క కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాగుకు సిద్దమైన రైతన్న ఆకాశం వైపు ధీనంగా చూస్తున్నా.. వరుణుడు కరుణించడం లేదు. పనుల కోసం కూలీలు ఎదురుచూస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో రెండు ఎకరాల పోలంలో వంద మంది కూలీలు పని చేసి తలో ముప్పై రూపాయలు పంచుకున్నారు. అసలే కరవు పరిస్థితులు ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో వచ్చిన 30 రూపాయలు కళ్లకు అద్దుకుని తీసుకుపోయారు.

చినుకు జాడ లేకపోయినా యాదాద్రి భువనగిరి జిల్లా పొడిచేడు గ్రామానికి చెందిన ఓ రైతు తనకున్న రెండు ఎకరాల్లో బోరు బావి ద్వారా పంటసాగుకు సిద్ధమయ్యాడు. వరి నాటు వేయడానికి 15 మంది కూలీలను పిలిచాడు. అంతే వర్షాలు లేక, పనుల్లేక అల్లాడుతున్న కూలీలు ఒక్కసారిగా పొలానికి వచ్చిపడ్డారు. ఊల్లో ఉన్న మొత్తం ఆడ కూలీలంతా ఎంతో కొంత దక్కుతుందన్న ఆశతో పొలంలోకి అడుగు పెట్టిన వారిని యజమాని ఎవరిని కాదనలేక రెండు ఎకరాల్లో పొలం నాటేందుకు మొత్తం మూడు వేల రూపాయలు కూలీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. పని దొరికిందని సంబరపడిపోయిన కూలీలు రెండు గంటల్లో రెండు ఎకరాల్లో చకచకా నాట్లు వేసి తలా ఒక 30 రూపాయలు తీసుకునున్నారు. పొడిచేడు గ్రామ పరిస్థితి చూస్తుంటే ముందు ముందు ఇంతటి కరవు కష్టాలు ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories