మేడారం జాతరను ప్లాస్టిక్ ఫ్రీ జోన్ గా మార్చాలి : మంత్రి సత్యవతి రాథోడ్

గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్
x
గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్
Highlights

2020 ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు మేడరంలో జరగనున్న సమ్మక్క-సారలమ్మ జాతర పనులను సకాలంలో పూర్తి చేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు.

2020 ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు మేడరంలో జరగనున్న సమ్మక్క-సారలమ్మ జాతర పనులను సకాలంలో పూర్తి చేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. బుధవారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్థికమాంద్యం ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మేడారం జాతర అభివృద్ది పనుల కోసం రూ .75 కోట్లను కేటాయించిందని వారు తెలిపారు. కేటాయించిన డబ్బును దుర్వినియోగం చేయకుండా ఉపయోగించాలన్నారు. భక్తులకు, వీఐపీల పార్కింక్ విషయంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. మేడారం సమీపంలో ఉన్న పర్యాటక కేంద్రాలను వచ్చిన భక్తులు సందర్శించడానికి పూర్తి ఏర్పాట్లు చేయాలని, పర్యాటక ప్రదేశాల గురించి ప్రచారం చేయాలని తెలిపారు. మేడారం జాతరలో ప్లాస్టిక్ వాడకుండా ప్లాస్టిక్ ఫ్రీ జోన్‌గా మార్చాలని సత్యవతి తెలిపారు. ఈ విషయంలో భక్తులకు అవగాహన కల్పించడం కోసం సైన్ బోర్డులు, బ్యానర్‌లను ఏర్పాటు చేయాలని ఆమె తెలిపారు.

మేడారంలో జరుగుతున్న అభివృద్ది పనుల పురోగతిని పర్యవేక్షించడానికి ప్రతి పక్షం రోజులకు ఒక సారి సమీక్షా సమావేశం నిర్వహించాలని ఆమె తెలిపారు. ఆదివాసుల సంస్కృతి, సంప్రదాయాలను విస్తరించే విధంగా జాతరను ఘనంగా నిర్వహించాలని అధికారులకు తెలిపారు. వీఐపీ పాస్‌లను దుర్వినియోగం చేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. భక్తులకు మార్గనిర్దేశం కల్పించేందుకు కరపత్రాలతో పాటు ఎల్‌సీడీ తెరలు, పోస్టర్లు ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతూ గిరిజన అతిపెద్ద పండుగైన మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించేందుకు యునెస్కో ప్రతినిధులను ఆహ్వానించాలని తెలిపారు. జాతర సంబంధించిన విషయాల గురించిన నివేదికను వారికి ప్రతిపాదనలు సిద్ధంచేయాలని చెప్పారు. అనంతరం ములుగు జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి మాట్లాడుతూ మేడారాం వెళ్లే ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే ప్రణాళికను తాము రూపొందిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా జంపన్నవాగు ప్రవాహంలో భక్తులకు భద్రత కల్పించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories