రిటైర్ అయ్యాక కూడా ప్రజా సేవలో మల్లన్న మాస్టర్

రిటైర్ అయ్యాక కూడా ప్రజా సేవలో మల్లన్న మాస్టర్
x
Highlights

అతని వయసు 70 సంవత్సరాలు. ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్ట్ అయ్యాడు. వయసుతో పాటు వచ్చే అనారోగ్య సమస్యలు ఉన్నాయి అయినా ఈ వయసులో కూడా. నిరక్ష రాస్యులకు సాయం...

అతని వయసు 70 సంవత్సరాలు. ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్ట్ అయ్యాడు. వయసుతో పాటు వచ్చే అనారోగ్య సమస్యలు ఉన్నాయి అయినా ఈ వయసులో కూడా. నిరక్ష రాస్యులకు సాయం చేస్తూ యువతకు కొండంత స్ఫూర్తై నిలుస్తున్నాడు. రిటైర్డ్ అయ్యాక ప్రజా సేవనే ఉద్యోగంగా మార్చుకున్న మల్లన్న మాస్టర్ పై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం.

సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని ఎస్బీఐ బ్యాంక్ ప్రతి రోజూ ఉదయం పదిన్నర గంటలకు బ్యాంక్ తెరుచుకుంటుంది. అయితే బ్యాంక్ తెరుకుకోక ముందే ఓ పెద్దాయన అక్కడకు చేరుకుంటారు. ఆయనను చూడగానే నమస్తే మల్లన్న మాస్టర్ అంటూ బ్యాంక్ సిబ్బంది మర్యాదపూర్వకంగా నమస్కరిస్తారు. బ్యాంక్ బయట నీడలో ఓ టేబుల్, చైర్ వేసి అతడిని కూర్చోపెడతారు. ఇక బ్యాంక్ స్టార్ట్ అయ్యాక మల్లన్న మాస్టర్ చైర్ వద్ద జనం క్యూ కడతారు.

మల్లన్న మాస్టర్ బ్యాంక్ వ్యవహారాలు అవగాహన లేని వారికి, నిరక్షరాస్యులకు వోచర్లు, డిపాజిల్ ఫారంలు రాసి పెడతారు నగదు జమ, విత్ డ్రి ఫారాలు నింపి ఇస్తుంటారు. బ్యాంకులో రుణ సౌకర్యాలు పెట్టుబడులపై అవగాహన ఇస్తుంటారు ఇలా బ్యాంకు వేళలు పూర్తయ్యే వరకూ అక్కడే ఉంటూ ఎలాంటి స్వార్ధం లేకుండా సహాయం చేస్తుంటారు. మార్చి 2012లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా రిటైర్డ్ అయ్యిన మల్లన్న మాస్టర్ అదే సంవత్సరం జూన్ నుంచి బ్యాంక్ వద్ద తన సేవలను అందిస్తున్నారు.

ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న సమయంలో కూడా మల్లన్న మాస్టర్ చాలా స్ట్రిట్. పాఠశాలలు మానేసిన పిల్లల ఇంటి చుట్టూ తిరిగి మళ్లీ బడిలో చేర్చే వరకూ ఊరుకునే వాడు కాదు. ఉపాధ్యాయుడిగా రిటైర్డ్ అయ్యిన తర్వాత బ్యాంకుకు వెళ్తున్న క్రమంలో అక్కడ నిరక్షరాస్యులు పడుతున్న బాధను చూసి ఇలా తనకు తోచిన సేవను అందిస్తున్నానని మల్లన్న మాస్టర్ చెబుతున్నారు. గుండె సంబంధిత వ్యాధితో మల్లన్న మాస్టర్ బాధపడిన రోజుల్లో కూడా బ్యాంకు సెలవుల్లో ఉన్న రోజుల్లో మాత్రమే ఆయన ఆసుపత్రికి వెళ్తుండేవారు. ఈ ఒక్క సందర్భంతో చాలు ఆయన నిబద్ధతను అర్ధం చేసుకోడానికి.

బ్యాంకుకు వచ్చే కస్టమర్లతో పాటు, బ్యాంకు అధికారులు సైతం మల్లన్న మాస్టర్ అందించే సేవలపట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మాస్టర్ కారణంగా తమపై పని భారతం తగ్గుతోందని చెబుతున్నారు. ఇక మలన్న మాస్టర్ సేవల గురించి విన్న కలెక్టర్ హనుమంతరావు సదాశివపేటలోని బ్యాంకు వద్దకు వచ్చి మల్లన్న మాస్టర్‌ను సన్మానించారు.

70 ఏళ్ల వయసులో ప్రజా సేవలో మల్లన్న మాస్టర్ చేస్తున్న సేవలు ఎందరికో స్ఫూర్తి దాయకం హ్యాట్సాఫ్ మల్లన్న మాస్టర్..


Show Full Article
Print Article
More On
Next Story
More Stories