యూరియా బస్తాల కోసం రైతన్న పడిగాపులు

యూరియా బస్తాల కోసం రైతన్న పడిగాపులు
x
Highlights

తెలంగాణలోని పలు జిల్లాల్లో పుష్కలంగా వర్షాలు కురిశాయి. ప్రాజెక్టులు నిండిపోయాయి. చెరువుల్లో భారీగా నీరు చేరింది. దీంతో రైతులు పంటలు విరివిగా వేశారు. సాగు విస్తీర్ణం బాగా పెరిగింది.

తెలంగాణలోని పలు జిల్లాల్లో పుష్కలంగా వర్షాలు కురిశాయి. ప్రాజెక్టులు నిండిపోయాయి. చెరువుల్లో భారీగా నీరు చేరింది. దీంతో రైతులు పంటలు విరివిగా వేశారు. సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. కానీ యూరియా కొరత రైతులను ఇబ్బందులకు గురి చేస్తుంది. వివిధ జిల్లాలకు సరఫరాలో జాప్యం కారణంగా యూరియా దొరక్క రైతులు అల్లాడుతున్నారు. పలు జిల్లాల్లో యూరియా కొరత తీవ్రంగా ఉంది. దీంతో రైతన్నలు వ్యవసాయ సహకార సంఘాలు, ఫర్టిలైజర్‌ షాపులు, DCMS కేంద్రాల వద్ద రోజంతా పడిగాపులు కాస్తున్నారు.

భూమి పట్టాదారు పాసు పుస్తకాల జిరాక్సులను క్యూ లైన్లుగా పెట్టి యూరియా కోసం నానా ఇబ్బందులకు గురవుతున్నారు. యూరియా కొరత సాకుతో వ్యాపారులు రైతులను దోచుకుంటున్నారు. 45కిలోల యూరియా బస్తా ధర 266.50 కాగా 350 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. తెలంగాణకు నెల కోటా ప్రకారం 1లక్ష 40వేల టన్నుల యూరియాను విదేశాల నుంచి వచ్చే కోటాను కేంద్రం కేటాయించగా.. ఇంతవరకు 50వేల టన్నుల వరకు కూడా రాలేదు. యూరియా కోసం రైతులు రోడ్డెక్కుతున్నారు. యూరియా అందించాలంటూ నిరసనలకు దిగుతున్నారు. తెలంగాణకు 2లక్షల 50వేల టన్నుల యూరియా పంపాలని కేంద్ర ఎరువుల శాఖ కార్యదర్శికి రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి లేఖ రాశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories