logo

ఆ విషయంపై ఏపీ ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరం: రాజాసింగ్

ఆ విషయంపై ఏపీ ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరం: రాజాసింగ్
Highlights

విజయవాడ గోశాలలో వందకుపై గోవులు చనిపోయినఆ విషయంపై ఏపీ ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరం: రాజాసింగ్మన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.

విజయవాడ గోశాలలో ఒక్కసారిగా 100 ఆవులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయవాడ గోశాల ఆవులు విష ప్రయోగంతో మృతి చెందినట్లు పోస్ట్ మార్టం రిపోర్టులో తేలింది. ఆవుల కడుపులో గడ్డి తప్ప ఇతర పదార్థాలు లేవని డాక్టర్లు తేల్చారు. గోశాలలోని పచ్చగడ్డి, దాణా, నీటి శాంపిల్స్ ను పశు సంవర్థక డాక్టర్లు తీసుకెళ్లారు. మరోవైపు ఆవుల మృతితో దుర్గందభరితమైన గోశాలను నిర్వాహకులు శుభ్రపరుస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ..విజయవాడ గోశాలలో వందకుపై గోవులు చనిపోయినఆ విషయంపై ఏపీ ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరం: రాజాసింగ్మన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.

తప్పుడు ఉద్దేశంతోనే కొందరు ఆవులను చంపేసినట్లు ఆయన అనుమానం వ్యక్తం చేశారు. మూగజీవాల మృతిపై న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ రోజు లేదా రేపు విజయవాడ గోశాలకు వెళ్లి నిజనిజాలు తెలుసుకుంటానని రాజాసింగ్ వెల్లడించారు. ఒకటో రెండో కాదు దాదారు 100కుపైగా సంఖ్యలో ఆవులు చనిపోవడం ఇది ఎదో కుట్రఉందని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ ఘటన ప్రత్యేక విచారణ చేపట్టాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు.


లైవ్ టీవి


Share it
Top