ప్రేమించిన యువతి బ్రేకప్ చెప్పిందని యువకుని ఆత్మహత్య

ప్రేమించిన యువతి  బ్రేకప్ చెప్పిందని యువకుని ఆత్మహత్య
x
Highlights

ప్రేమ...ప్రస్తుత కాలంలో ఎక్కడ విన్నా, ఎక్కడ చూసినా కనిపించేది, వినిపించేది ప్రేమ జంటలు, ప్రేమ కబుర్లు. ఒకరికి ఒకరమంటూ ప్రేమిచుకుంటున్నారు. కొన్ని రోజుల తరువాత చిన్న చిన్న కారణాలతో విడిపోతున్నారు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ విధంగానే హైదరాబాద్ లోను ఒక సంఘటన చోటు చేసుకుంది. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన తన ప్రియురాలు తనకి బ్రేకప్ చెప్పి వదిలేసింది. ఇంకా ఎప్పటికీ కలవదని, తాను ఎంతగానో ప్రేమించిన యువతీ తననుంచి దూరమైందని యువకుడు మస్తాపానికి గురయ్యాడు. చివరిసారిగా ఆమెతో మాట్లాడటానికి ప్రయత్నాలు చేసాడు. అయినా కుదరలేదు. దీంతో ఆ యువకుడు తన చివరి శ్వాసని వొదిలేసాడు.

ప్రేమ...ప్రస్తుత కాలంలో ఎక్కడ విన్నా, ఎక్కడ చూసినా కనిపించేది, వినిపించేది ప్రేమ జంటలు, ప్రేమ కబుర్లు. ఒకరికి ఒకరమంటూ ప్రేమిచుకుంటున్నారు. కొన్ని రోజుల తరువాత చిన్న చిన్న కారణాలతో

విడిపోతున్నారు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ విధంగానే హైదరాబాద్ లోను ఒక సంఘటన చోటు చేసుకుంది. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన తన ప్రియురాలు తనకి బ్రేకప్ చెప్పి వదిలేసింది. ఇంకా ఎప్పటికీ కలవదని, తాను ఎంతగానో ప్రేమించిన యువతీ తననుంచి దూరమైందని యువకుడు మస్తాపానికి గురయ్యాడు. చివరిసారిగా ఆమెతో మాట్లాడటానికి ప్రయత్నాలు చేసాడు. అయినా కుదరలేదు. దీంతో ఆ యువకుడు తన చివరి శ్వాసని వొదిలేసాడు.

బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఫిల్మ్‌నగర్‌లోని ఎంఆర్‌సీ కాలనీకి చెందిన అభిషేక్ షిండే (20) యూసుఫ్‌గూడలోని మేరీస్ కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నాడు. బంజారాహిల్స్ రోడ్ నం. 14లోని నందినగర్‌లో నివసిస్తూ డిగ్రీ చదువుతున్న వరుసకు బంధువయ్యే యువతి (19) నాలుగేండ్ల క్రితం పరిచయమైంది. అది ప్రేమగా మారడంతో సినిమాలు, షికార్లకు వెళ్లారు. రెండు నెలల క్రితం చిన్న చిన్న కారణాలతో విడిపోయారు. ఆ క్రమంలో ఆ యువతి అభిషేక్ షిండేకు బ్రేకప్ చెప్పింది. దీంతో ఆ యువకుడు తీవ్ర మనస్తాపానికి గురయ్యా డు. దీంతో ఆ యువకుడు యువతికి తాను చనిపోతున్నానని ఒక్కసారి మాట్లాడాలని ఫోన్‌లో మెసేజ్ పెట్టాడు. ఆమె స్పందించకపోవడంతో మరోసారి ఇక సెలవంటూ మరో మెసేజ్ పెట్టి.. అదే సమయంలో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన అతని సోదరుడు, వదిన కిందకు దించి ఆస్పత్రికి తరలిస్తుండగా అప్పటికే మృతిచెందాడు. దీంతో తండ్రి నర్సింగ్‌రావు షిండే తన కుమారుడు మృతికి యువతి కారణమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories