ప్రేమ పేరుతో మోసం చేసిన ఎన్నారై

ప్రేమ పేరుతో మోసం చేసిన ఎన్నారై
x
Highlights

ప్రేమపేరుతో ‌ఓ యువతిని NRI మోసం చేశాడు. కలిసి చదువుకున్నప్పటి నుంచి ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి చనువుగా మెలిగాడు. తీరా అవసరం తీరాక...

ప్రేమపేరుతో ‌ఓ యువతిని NRI మోసం చేశాడు. కలిసి చదువుకున్నప్పటి నుంచి ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి చనువుగా మెలిగాడు. తీరా అవసరం తీరాక ఉద్యోగం పేరుతో ఆస్ట్రేలియా చెక్కేశాడు యువకుడు ఈ ఘటన నల్గొండ జిల్లాలో జరిగింది. మచలాపురం గ్రామానికి చెందిన మౌనిక.. బాసలో ట్రిపుల్‌ ఐటీ చదువుకుంది. అదే సమయంలో గ్రామానికి చెందిన ముద్దం శివతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ ప్రేమించుకుంటూ.. కొంతకాలం తరచూ ఫోన్‌లో మాట్లాడుకునేవారు.

అయితే శివ.. బీటెక్‌ పూర్తి చేసిన తర్వాత ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. అనంతరం పలుమార్లు స్వదేశానికి వచ్చి.. లాడ్జిలో లావ్యణను కలిసేవాడు. అయితే మౌనిక అతనిని పెళ్లి చేసుకోమని అడిగినప్పటి నుంచి మొఖం చాటేశాడు. శివపై బాధితురాలు మర్రిగూడ పోలీస్‌ స్టేషన్‌లో కేసు పెట్టింది. NRI ముద్దం శివ తనను నాలుగేళ్లుగా ప్రేమ పేరుతో వంచించాడని ఫిర్యాదులో పేర్కొంది. అయినా పోలీసులు పట్టించుకోకపోవడంతో చివరికి జిల్లా ఎస్పీని ఆశ్రయించింది మౌనిక.. తనకు న్యాయం చేయాలని కోరుతుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories