logo

TSRTC Strike: భార్య ఉద్యోగం పోతుందనే బెంగతో భర్త మృతి

TSRTC Strike: భార్య ఉద్యోగం పోతుందనే బెంగతో భర్త మృతి
Highlights

ఆర్టీసీ సమ్మె ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది.

ఆర్టీసీ సమ్మె ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. సమ్మె కారణంగా తన భార్య ఉద్యోగం ఎక్కడ పోతుందో అన్న భయంతో గుండె పోటుతో వ్యక్తి మృతి చెందిన సంఘటన బాబానగర్‌లో బుధవారం చోటుచేసుకుంది. కర్నె కిశోర్ (39) అతని భార్య నాగరాణి పట్టణంలోని బాబానగర్లో నివసిస్తున్నారు. కిశోర్‌ ప్రైవేట్‌ కారు డ్రైవర్‌గా, భార్య నాగరాణి ఆర్టీసీలో పని చేస్తూ జీవనాన్ని సాగిస్తున్నారు. ఐదు రోజులుగా ఆర్టీసీలో కార్మికులు నిర్వహిస్తున్న సమ్మె కారణంగా ప్రభుత్వం కార్మికులను ఉద్యోగం నుంచి తొలగిస్తామని ప్రకటించింది. ఈ క్రమంలోనే భార్య ఉద్యోగం పోతే బతకడం కష్టమవుతుందని భర్త మనస్తాపానికి గుర్తె రెండు రోజులుగా భోజనం మానేసాడు. దింతో అస్వస్థతకు గురైన కిశోర్ నిద్రలో ఉండగానే గుండెపోటు రావడంతో మృతి చెందాడు. మృతుడికి భార్య నాగరాణితోపాటు రెండేళ్ల పాప ఉంది. తన భర్త మృతికి సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యాలే కారణమని నాగరాణి, బంధువులు ఆరోపించారు.


లైవ్ టీవి


Share it
Top