ఆ ఊరిలో 12 మంది డాక్టర్లు

ఆ ఊరిలో 12 మంది డాక్టర్లు
x
Highlights

దేశానికి రైతే వెన్నెముక అంటారు. ఇలాంటి రైతులు వుండే గ్రామాల నుంచి ఎంతో మంది అధికారులు బయటికోస్తునారు. తెలంగాణా లోని ఒక మారు మూల జిల్లాలోని ఒక గ్రామంలో 12 మంది డాక్టర్లు ఉండటం గమనార్హం. ఆ గ్రామం నుండి డాక్టర్లుగా స్థిరపడిన వారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

జగిత్యాల జిల్లాలోని లక్ష్మీపూర్‌ గ్రామం నుంచి దాదాపు 12 మంది డాక్టర్ వృతిలో ఉన్నారు. వీరిలో ప్రస్తుతం ఐదుగురు తమ వైద్య వృత్తిని కొనసాగిస్తున్నారు. మరికొందరు డాక్టర్ కోర్సును చదువుతున్నారు. అయితే ప్రస్తుతం వైద్యులుగా రోగులకు సేవలందిస్తున్న మేడిపల్లి ప్రియాంక– శ్రీనివాస్‌రెడ్డిలు హైదరాబాద్‌లో గైనకాలజి ప్రైవేట్‌ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. డాక్టర్‌ జయంతి–డాక్టర్‌ ఉదయ్‌ జగిత్యాలలో గైనకాలజి ప్రైవేట్‌ ఆసుపత్రి ఏర్పాటు చేసుకున్నారు. అదే విధంగా డాక్టర్‌ కొప్పెర మహేశ్‌– శిరీష జగిత్యాలలో ఆర్థోపెడిక్‌ ఆస్పత్రిని, అటుకుల రాహుల్‌ ఎంబీబీఎస్‌ పూర్తి చేసునారు. గర్వందుల శరణ్య ఎంబీబీఎస్‌లో భాగంగా హౌస్‌ సర్జన్‌గా, ఎర్రవేల్లి శ్రీనాథ్, పన్నాల మధు, గడ్డం గోవర్ధన్‌రెడ్డిలు ఎంబీబీఎస్‌ చదువుతున్నారు. గర్వందుల నందిని బీడీఎస్‌ చదువుతుంది. నాతర్ల సంజీవ్‌ బీడీఎస్‌ పూర్తి చేసి ఎండీఎస్‌ చదువుతున్నాడు. వీరిని తమ రోల్మోడల్ గా తీసుకుని ఇంకొంత మంది ఆ గ్రామం నుంచి వైద్య విద్య చదవడానికి ముందుకు వస్తున్నారు.

వీరిలాగానే ప్రతి పల్లెలోనూ యువత వారి బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories