జ్ఞానదంతం ఓ యువకుడి కుటుంబంలో చీకట్లు నింపింది

జ్ఞానదంతం ఓ యువకుడి కుటుంబంలో చీకట్లు నింపింది
x
Highlights

జ్ఞానదంతం ఓ యువకుడి కుటుంబంలో చీకట్లు నింపింది. ఏడాది క్రితం వరకు అందరిలా ఉన్నంతలో సర్ధుకుంటూ బతుకు బండిని సాగిస్తూ జీవనం సాగిస్తున్న యువకునికి పంటి...

జ్ఞానదంతం ఓ యువకుడి కుటుంబంలో చీకట్లు నింపింది. ఏడాది క్రితం వరకు అందరిలా ఉన్నంతలో సర్ధుకుంటూ బతుకు బండిని సాగిస్తూ జీవనం సాగిస్తున్న యువకునికి పంటి ఇన్ ఫెక్షన్ ప్రాణాలపైకి తెచ్చింది. మౌత్ క్యాన్సర్ తో ప్రాణాలతో పోరాడుతున్నాడు. చికిత్స కోసం ఉన్న ఎకరం పొలం అమ్ముకుని అప్పులు చేశారు. మరో ఆపరేషన్ చేయాల్సి ఉండటంతో ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నారు కుటుంబ సభ్యులు. క్యాన్సర్ తో పోరాడుతున్న ఇందూరు యువకుని దీనస్థితిపై ప్రత్యేక కథనం.

ఈ యువకుడి పేరు రవినాయక్. నిజామాబాద్ పట్టణానికి చెందిన రవినాయక్ 15 ఏళ్ల క్రితం వివాహం అయ్యింది. భార్యాఇద్దరు పిల్లలతో ఎంతో సంతోషంగా జీవనం సాగిస్తున్న రవినాయక్ కుటుంబాన్ని చూసి విధికి కన్నుకుట్టింది. ఏడాది క్రితం రవినాయక్ వచ్చిన జ్ఞానదంతం అతని కుటుంబంలో సంతోషాన్ని ఆవిరి చేసింది. జ్ఞానదంతంతో పాటు వచ్చిన ఇన్ ఫెక్షన్ తో రవినాయక్ కు మౌత్ క్యాన్సర్ అటాక్ అయ్యింది. చికిత్స కోసం జమ చేసుకున్న డబ్బులతో పాటు ఎకరం పొలం అమ్మి దాదాపు 12 లక్షల వరకు ఖర్చు చేసి ఫిబ్రవరిలో ఆపరేషన్ చేయించారు.

పంటినోప్పితో పాటు మౌత్ క్యాన్సర్ తో రవీనాయక్ కు చెంప తొలగించి ప్లాస్టిక్ సర్జరీ చేశారు. అయినా కోలుకోలేదు. సరిగా నడవలేడు నిలబడలేడు. నోటీ ద్వారా ఆహారం తీసుకోలేని పరిస్థితి. ముక్కు నుంచి వేసిన పైపు ద్వారా లిక్విడ్ రూపంలో ఆహారం తీసుకుంటున్నాడు. చంటి బిడ్డకు చూసుకున్న విధంగా రవినాయక్ కు సేవలందిస్తుంది అతని భార్య. వచ్చే నెల మరో ఆపరేషన్ చేయాలని వైద్యులు చెప్పడంతో రవినాయక్ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. ఆపన్న హస్తం అందించి తన భర్తను కాపాడాలని బాధితుని భార్య మీరాబాయి వేడుకుంటుంది.

ఇప్పటికే అప్పులతో కుటుంబ పోషణ భారంగా ఉందని చికిత్స కోసం ప్రభుత్వం సహకరించాలని రవినాయక్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. క్యాన్సర్ తో రోడ్డున పడ్డ రవినాయక్ కుటుంబాన్ని ప్రభుత్వం, దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories