ప్రపంచకప్ జరిగే మైదానాలివే!

ప్రపంచకప్ జరిగే మైదానాలివే!
x
Highlights

ఏ క్రీడా అయినా సెంటిమెంట్ ని నమ్ముకునే వారు చాలా మంది ఉంటారు. క్రీడాకారులు, ఆయా బోర్డులు, అన్నిటినీ మించి అభిమానులు.. ఆ మధ్య జరిగిన పోటీలో టాస్ గెలిచి...

ఏ క్రీడా అయినా సెంటిమెంట్ ని నమ్ముకునే వారు చాలా మంది ఉంటారు. క్రీడాకారులు, ఆయా బోర్డులు, అన్నిటినీ మించి అభిమానులు.. ఆ మధ్య జరిగిన పోటీలో టాస్ గెలిచి ఈ మైదానంలో బ్యాటింగ్ ఎంచుకున్న జట్టు గెలిచింది. ఈ మైదానంలో ఇప్పటి వరకూ ఈ టీం కు ఓటమే లేదు.. ఇక్కడ ఫలానా ఆటగాడు సెంచరీ కచ్చితంగా చేస్తాడు.. ఇలా క్రికెట్లోనూ సెంటిమెంట్ గా మాట్లాడటం చాలా ఎక్కువే. విశ్లేషకులు, కామెంట్రీటర్ లు కూడా ఇలా సెంటిమెంటల్ గా మాట్లాడుతూనే ఉంటారు. ఆ గణాంకాలలో చాలా వరకూ నిజం ఉంటుంది కూడా. ఈ విధంగా చూస్తే జట్టు కూర్పు తో బాటు మ్యాచ్ జరిగే మైదానమూ ముఖ్య పాత్ర పోషిస్తుంది క్రికెట్లో. ఇపుడు మరో 13 రోజుల్లో ప్రారంభం కానున్న వరల్డ్ కప్ పోటీలకు క్రికెట్ పుట్టిల్లు గా చెప్పుకునే ఇంగ్లాండ్ ఆతిథ్యం ఇస్తోంది.

ఇక్కడి మైదానాల్లో ఆడటం అంటే ప్రపంచవ్యాప్తంగా క్రికెటర్లకు చాలా ఇష్టం. ఐపీఎల్ రాక ముందు ఇంగ్లాండ్ కౌంటీ ల్లో ఆడటానికి క్రికెటర్లందరూ ఉత్సాహం చూపేవారు. క్రికెట్ పండగకు 13 రోజులే ఉన్న వేళ ఈసారి ఇంగ్లాండ్ లో క్రికెట్ పోటీలు జరుగబోతున్న మైదానాల మీద ఓ లుక్కేద్దాం..

కెన్నింగ్టన్ ఓవల్ - లండన్


ప్రారంభం: 1845 కెపాసిటీ : 23500

ప్రపంచకప్ లో ఇక్కడ జరగబోయే మ్యాచులు..

ఇండియా న్యూజిలాండ్ ల మధ్య వార్మప్ మ్యాచ్, ఇంగ్లాండ్ ఆఫ్ఘనిస్తాన్ ల మధ్య వార్మప్ మ్యాచ్ లు,

ఇంగ్లాండ్ సోతాఫ్రికాల మధ్య ఈ నెల 30న మొదటి మ్యాచ్ తో టోర్నీ ఇక్కడే ప్రారంభం కాబోతోంది.

సౌత్ ఆఫ్రికా బంగ్లాదేశ్ ల మధ్య జూన్ 2 ,

బంగ్లాదేశ్ న్యూజిలాండ్ ల మధ్య జూన్ 5,

ఇండియా ఆస్ట్రేలియా జూన్ 9,

శ్రీలంక ఆస్ట్రేలియా జూన్ 15 న ఇక్కడ మ్యాచులు జరగనున్నాయి.

---

ట్రెంట్ బ్రిడ్జ్ - నాటింగ్ హాం



ప్రారంభం: 1841 కెపాసిటీ : 15,300 నుంచి 17,000 వరకు

ప్రపంచకప్ లో ఇక్కడ జరగబోయే మ్యాచులు.

వెస్టిండీస్, పాకిస్థాన్ మ్యాచ్ మీ 31,

ఇంగ్లాండ్ పాకిస్థాన్ మ్యాచ్ జూన్ 3,

ఆస్ట్రేలియా వెస్టిండీస్ మ్యాచ్ జూన్ 6,

ఇండియా, న్యూజిలాండ్ మ్యాచ్ జూన్ 13,

ఆస్ట్రేలియా బాంగ్లాదేశ్ మ్యాచ్ జూన్ 20


కంట్రీ గ్రౌండ్ - బ్రిస్టల్


ప్రారంభం: 1889 కెపాసిటీ : 15,000 వరకు

ప్రపంచకప్ లో ఇక్కడ జరగబోయే మ్యాచులు.

పాకిస్థాన్ ఆఫ్ఘనిస్థాన్ మొదటి వార్మప్ మ్యాచ్, సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ 5 వ వార్మప్ మ్యాచ్,

న్యూజిలాండ్ వెస్టిండీస్ 9వ వార్మప్ మ్యాచ్..

ఆఫ్గనిస్తాన్ ఆస్ట్రేలియా జూన్ 1న మ్యాచ్

ది రోస్ బౌల్ - సౌతాంఫ్టన్


ప్రారంభం: 2001 కెపాసిటీ : 6,500 (అవసరాన్ని బట్టి 20000 వరకూ కూర్చునేలా తాత్కాలిక ఏర్పాట్లు చేస్తారు)

ప్రపంచకప్ లో ఇక్కడ జరగబోయే మ్యాచులు..

ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా 3వ వార్మప్ మ్యాచ్, ఆస్ట్రేలియా శ్రీలంక 7వ వార్మప్ మ్యాచ్,

సౌతాఫ్రికా ఇండియా జూన్ 8,

సౌతాఫ్రికా వెస్టిండీస్ జూన్ 15,

ఇంగ్లాండ్ వెస్టిండీస్ జూన్ 14,

ఇండియా ఆఫ్ఘనిస్తాన్ జూన్ 22,

బంగ్లాదేశ్ ఆఫ్గనిస్తాన్ జూన్ 24


ది కూపర్ అసోసియేట్స్ కౌంటీ గ్రౌండ్ - టాన్ టాన్


ప్రారంభం: 1882 కెపాసిటీ: 6500

ఇక్కడ జరిగే మ్యాచులు..

ఆఫ్ఘనిస్థాన్ న్యూజిలాండ్ జూన్ 13,

ఆస్ట్రేలియా పాకిస్థాన్ జూన్ 12,

వెస్టిండీస్ బాంగ్లాదేశ్ జూన్ 17


ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫ్ఫార్డ్ - మాంచెస్టర్


ప్రారంభం : 1857, కెపాసిటీ: 19000

ఇక్కడ జరిగే మ్యాచులు..

ఇండియా పాకిస్థాన్ జూన్ 16,

ఇంగ్లాండ్ఆఫ్ఘనిస్థాన్ జూన్ 18,

వెస్టిండీస్ న్యూజిలాండ్ జూన్ 22,

వెస్టిండీస్ ఇండియా జూన్ 27,

ఆస్ట్రేలియా సౌతాఫ్రికా జులై 6

జూలై 9న మొదటి సెమీఫైనల్


బస్టన్ - బిమింగ్ హాం


ప్రారంభం: 1882 కెపాసిటీ: 21,000

ఇక్కడ జరిగే మ్యాచులు..

న్యూజిలాండ్ సౌతాఫ్రికా 19 జూన్,

న్యూజీలాండ్ పాకిస్థాన్ జూన్ 26,

ఇంగ్లాండ్ ఇండియా జూన్ 30,

బాంగ్లాదేశ్ ఇండియా జులై 2,

2వ సెమీ ఫైనల్

హీడింగ్లే లీడ్స్


ప్రారంభం: 1890 కెపాసిటీ : 17000

ఇంగ్లాండ్ శ్రీలంక జూన్ 21,

పాకిస్థాన్ ఆఫ్ఘనిస్థాన్ జూన్ 29,

ఆఫ్ఘనిస్థాన్ వెస్టిండీస్ జులై 4,

శ్రీలంక ఇండియా జులై 6




లార్డ్స్ - లండన్


ప్రారంభం: 1814 కెపాసిటీ: 30000

పాకిస్థాన్ సౌతాఫ్రికా జూన్ 23,

ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా జూన్ 25,

న్యూజిలాండ్ ఆస్ట్రేలియా జూన్ 29,

పాకిస్థాన్ బంగ్లాదేశ్ జులై 5

ఫైనల్



రివర్ సైడ్ గ్రౌండ్ - చెస్టర్ లే స్ట్రీట్



ప్రారంభం :1995, కెపాసిటీ: 5000 (17000 ఇంటెర్నేషనల్స్)

శ్రీలంక సౌత్ ఆఫ్రికా జూన్ 28,

శ్రీలంక వెస్టిండీస్ జులై 1,

ఇంగ్లాండ్ న్యూజీలాండ్ జులై 3



సోఫియా గార్డెన్ కార్డిఫ్ (వేల్స్)


కెపాసిటీ : 15,000

శ్రీలంక సౌతాఫ్రికా 2వ వార్మప్

పాకిస్థాన్ బంగ్లాదేశ్ 6వ వార్మప్ ఇండియా బంగ్లాదేశ్ 10 వ వార్మప్

న్యూజిలాండ్ శ్రీలంక మ్యాచ్ 3

ఆఫ్ఘనిస్థాన్ శ్రీలంక జూన్ 4,

ఇంగ్లాండ్ బాంగ్లాదేశ్ జూన్ 8,

సౌతాఫ్రికా ఆఫ్ఘనిస్తాన్ జూన్ 15

Show Full Article
Print Article
Next Story
More Stories