అదృష్టం అందలం ఎక్కించేనా?

అదృష్టం అందలం ఎక్కించేనా?
x
Highlights

పోరాడి గెలవడం సహజం.. గెలుపుకోసం సర్వశక్తులు ఒడ్డడం జరుగుతూనే ఉంటుంది... అయితే అన్ని సార్లు మనం పోరాటం తోనే గెలవడం జరగకపోవచ్చు. మరి ముఖ్యంగా క్రికెట్...

పోరాడి గెలవడం సహజం.. గెలుపుకోసం సర్వశక్తులు ఒడ్డడం జరుగుతూనే ఉంటుంది... అయితే అన్ని సార్లు మనం పోరాటం తోనే గెలవడం జరగకపోవచ్చు. మరి ముఖ్యంగా క్రికెట్ లో ఇది అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది.. ఇప్పుడు సన్ రైజర్స్ విషయంలోనూ అదే జరిగింది .. కొలకత్తా జట్టు ఓటమి హైదరాబాద్ కి వరంగా మారింది . తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో చేతులెత్తేసి నైట్ రైడర్స్ టీం హైదరాబాద్ కి ప్లే ఆఫ్ ఛాన్స్ కట్టబెట్టేసింది .. ఎలా ప్లే ఆఫ్ కి చేరామో అని అ జట్టు ఆశ్చర్య పోయే

పరిస్థితిలో మరో రికార్డు కూడా సృష్టించింది .. పుష్కర కాలంలో ఐపిఎల్ లో కేవలం పన్నెండు పాయింట్లతో మొదటి నాలుగు స్థానాల్లో చోటు సంపాదించిన జట్టుగా సన్ రైజర్స్ చరిత్ర లిఖించింది ...

ఐపీఎల్‌ చరిత్రలోనే అతి తక్కువ పాయింట్లతో (12) ప్లేఆఫ్స్‌కు చేరిన జట్టు హైదరాబాదే. ఇప్పటిదాకా కనిష్టంగా 14 పాయింట్లతోనే జట్లు ముందంజ వేశాయి. లీగ్‌ దశ చివరి మ్యాచ్‌లో కోల్‌కతా.. ముంబయి చేతిలో ఓడిపోవడంతో సన్‌రైజర్స్‌కు ప్లేఆఫ్స్‌లో స్థానం దక్కింది. సన్‌రైజర్స్‌తో పాటు కోల్‌కతా, పంజాబ్‌ సైతం 12 పాయింట్లతో సమానంగా నిలిచాయి. ఐతే నెట్‌ రన్‌రేట్‌ (+0.577) మెరుగ్గా ఉండటంతో సన్‌రైజర్స్‌ ప్లేఆఫ్స్‌ బెర్తు దక్కించుకుంది... ప్రతిష్టాత్మక టోర్నమెంట్ లో చిన్ని తప్పిదం కూడా అవకశాలను దూరం చేస్తుంది .. అలాగే కొద్ది తేడా విజయానికి మెట్టుగా మారుతుంది .. ఇప్పుడు సన్ రైజర్స్ విషయంలోనూ అదే జరిగింది ..

మొత్తం ఐపిఎల్ లో నైట్ రైడర్స్ కి (+0.028) నెట్ రన్ రేట్ ఉంది ... ఇక హైదరాబాద్ కి (+0.577) రన్ రేట్ ఉంది .. రన్ రేట్ లో చిన్నపాటి తేడాతో రన్ రైజర్స్ ప్లే ఆఫ్ బాట పట్టింది .. హైదరాబాద్ జట్టు దక్కన్ ఛార్జర్స్ గా ఉన్నప్పుడు రెండు సార్లు ప్లే ఆఫ్ చేరి ఒక్కసారి విజేతగా నిలిచింది .. ఇప్పుడు సన్ రైజర్స్ గా నాలుగు సార్లు ప్లే ఆఫ్ కి చేరి ఒక్కసారి కప్పు గెలిచింది .. మరోసారి రన్ రప్ తో సరిపెట్టుకుంది ... ఇదే అదృష్టం రిపీట్ అయి సన్ రైజర్స్ ఈ సారి కప్పు కొడితే బాగుండు అని అభిమానులు కోరుకుంటున్నారు .. ఎం జరిగుతుందో చూడాలి మరి ...

Show Full Article
Print Article
Next Story
More Stories