logo

ధోనీ అలా ఎందుకు చేశాడో తెలుసా?

ధోనీ అలా ఎందుకు చేశాడో తెలుసా?
Highlights

సాధారణంగా ఏ క్రికెటరైనా ఒక టోర్నీ మొత్తం ఒకే బ్యాట్ వాడతాడు. లేదా ఎపుడైనా మార్చాల్సి వస్తే రెండోది...

సాధారణంగా ఏ క్రికెటరైనా ఒక టోర్నీ మొత్తం ఒకే బ్యాట్ వాడతాడు. లేదా ఎపుడైనా మార్చాల్సి వస్తే రెండోది మారుస్తాడు. అదీ కూడా ఒకటే కంపెనీది వాడటం చూస్తుంటాము. కానీ, మిస్టర్ కూల్ ధోనీ.. ఈ ప్రపంచ కప్ లో ఇప్పటి వరకూ మూడు బ్యాటులు మార్చాడు. అదీ మూడు రకాల బ్యాటులు. టోర్నీ ప్రారంభం లోనే తన గ్లౌస్ పై ఇండియన్ ఆర్మీ లోగో వేసుకుని చర్చ రేపిన ధోనీ.. ఇపుడు ఈ బ్యాటుల కథ కూడా అభిమానుల్లో ఆసక్తిని కలిగించింది. బ్యాట్లు మార్చడం సహజమే కావచ్చు కానీ, మూడు రకాల కంపెనీల బ్యాటులు ఎందుకు వాడాడు ధోనీ అనేది అందరిలోనూ రేకెత్తిన సందేహం. దానిని తీర్చేసింది ఐసీసీ. ఈ విషయం పై ఐసీసీ ఓ ట్వీట్ చేసింది. ధోనీ ఎందుకు రకరకాల కంపెనీల బ్యాట్లు వాడుతున్నాడు అంటూ ప్రశ్నించి.. దానికి సమాధానం తెల్సింది అంటూ ఐసీసీ చెప్పింది. తన కెరీర్లో తాను ఆడిన బ్యాట్లు అందించిన కంపెనీలన్నిటికీ కృతజ్ఞత తెలుపుకోవడం కోసమే ఈ పని చేశాడట ధోనీ. ధోనీ కి ఇదే చివరి వరల్డ్ కప్. దాంతో తన కెరీర్ లో తనకు పేరు తెచ్చిన బ్యాట్ లకు ఈ విధంగా తన ధన్యవాదాలని తెలిపాడట. ఇదీ ధోనీ స్టైల్. అందుకే కూల్ ధోనీ క్రికెట్ ప్రపంచంలో ఉన్నతంగా వెలిగిపోతున్నాడు. కాదంటారా?





లైవ్ టీవి


Share it
Top