టీమిండియా సెమీస్ లో ఎవరితో?

టీమిండియా సెమీస్ లో ఎవరితో?
x
Highlights

టీమిండియా సెమీస్ చేరింది. పాయింట్ల పట్టికలో రెండో స్థానం లో నిలిచింది. వరల్డ్ కప్ టోర్నీ ఇక ప్రీ క్లైమాక్స్ కు చేరుకుంటోంది. ఇక సెమీస్ చేరే మూడు...

టీమిండియా సెమీస్ చేరింది. పాయింట్ల పట్టికలో రెండో స్థానం లో నిలిచింది. వరల్డ్ కప్ టోర్నీ ఇక ప్రీ క్లైమాక్స్ కు చేరుకుంటోంది. ఇక సెమీస్ చేరే మూడు నాలుగు జట్లు ఎవనేది తెలాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న సమీకరణాల ప్రకారం మొదటి రెండు స్థానాల్లో ఆస్ట్రేలియా, ఇండియా ఉన్నాయి. అయితే.. ఆస్ట్రేలియా కనుక దక్షిణాఫ్రికాతో జరగబోయే మ్యాచ్ లో ఓడిపోతే.. ఇండియా పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి వెళుతుంది. అపుడు నాలుగో స్థానం లో ఉండే జట్టుతో సెమీస్ ఆడాల్సి ఉంటుంది. ఒకవేళ ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా పై గెలిస్తే మొదటి స్థానంలో ఉంటుంది. అపుడు ఇండియా మూడోస్థానంలో ఉండే జట్టుతో సెమీస్ ఆడాల్సి ఉంటుంది. ఇప్పడు మూడు..నాలుగు ఎవరు కావచ్చు?

వరల్డ్ కప్ మజానే అది.. మొదట్లో ఏదోగా ప్రారంభం అయిన టోర్నీ.. ఇపుడు అభిమానుల్లో ఉత్సుకతను రేకెత్తిస్తోంది. సెమీస్ చేరే మూడో జట్టు, నాలుగో జట్టు ఏమిటనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. మూడో బెర్త్ కోసం న్యూజిలాండ్, ఇంగ్లాండ్ తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ లో కివీస్ గెలిస్తే ఆ స్థానం దానిదే. అపుడు భారత్,కివీస్ మధ్య సెమీస్ ఉంటుంది. అలా కాకుండా.. ఇంగ్లాండ్ గెలిస్తే.. అదే ప్రత్యర్థి అవుతుంది. ఇక..నాలుగో స్థానం చాలా సమీకరణాల మీద ఆధారపడి ఉంది. ఈ బెర్త్ కోసం పాకిస్తాన్ కూడా రేసులో ఉంది. అన్ని సమీకరణాలు కుదిరి పాక్ నాలుగో స్థానం లో సెమీస్ కు వస్తే.. భారత్ మొదటి స్థానానికి చేరితే పాక్ తో సెమీస్ ఉండే అవకాశం ఉంటుంది. అయితే, ఇందుకు అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. మొదటిది పాక్ సెమీస్ చేరే దారే చాల కష్టం.. ఒకవేళ చేరినా ఇప్పటి జట్ల తీరు ప్రకారం ఇండియా మొదటి స్థానానికి చేరుకోవడం దాదాపు జరిగే పని కాదు. అందువల్ల ఇండియా, పాకిస్థాన్ సెమీస్ లో తలపడే అవకాశాలు లేనట్టే. ఇప్పటికున్న లెక్కల ప్రకారం భారత్ సెమీస్ ప్రత్యర్థి న్యూజిలాండ్ లేదా ఇంగ్లాండ్ అయ్యే అవకాశాలే ఎక్కువ.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories