మీకు అసలు సూపర్ ఓవర్ రూల్స్ తెలుసా ?

మీకు అసలు సూపర్ ఓవర్ రూల్స్ తెలుసా ?
x
Highlights

నిన్న లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్ మరియు న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్ లో మొదటగా ఇరు జట్ల మధ్య మ్యాచ్ టైగా ముగిసింది . దీనితో సూపర్...

నిన్న లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్ మరియు న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్ లో మొదటగా ఇరు జట్ల మధ్య మ్యాచ్ టైగా ముగిసింది . దీనితో సూపర్ ఓవర్ అనేది అనివార్యం అయింది . ఇరు జట్ల మధ్య సూపర్ ఓవర్ జరగగా ముందు బ్యాటింగ్ కి దిగిన ఇంగ్లిష్ టీం ఆరు బంతుల్లో 15 పరగులు చేసింది . 16 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు కూడా 15 పరుగులే చేసింది కానీ విజేతగా మాత్రం ఇంగ్లాండ్ నిలిచింది . ఇది ఐసీసీ నిబంధనల ప్రకారం జరిగింది . ఇంతకి సూపర్ ఓవర్ లో రూల్స్ ఎలా ఉంటాయో తెలుసుకోండి .. !

1. సూపర్ ఓవర్ లో ఎవరు ఎక్కువ రన్స్ చేస్తే వారే విజేత

2. ఒక్కో టీమ్ నుంచి ముగ్గురు బ్యాట్సమెన్ , ఒక బౌలర్ సూపర్ ఓవర్ లో పాల్గోవాలి. వీరు కచ్చితంగా ఆ టీమ్ 11 మంది సభ్యుల నుంచే ఉండాలి.

3. ఇన్నింగ్స్ లో రెండో సారి బ్యాటింగ్ చేసిన టీమ్ సూపర్ ఓవర్ లో మొదట బ్యాటింగ్ చేస్తుంది. తరువాత ఫీల్డింగ్ చేసిన జట్టు బ్యాటింగ్ చేస్తుంది. బౌలింగ్ ఏ ఎండ్ నుంచి చేయాలనేది బౌలింగ్ టీమ్ కెప్టెన్ నిర్ణయించుకోవచ్చు.

4 . ఎవరు ఎక్కువ రన్స్ చేస్తే వారే గెలిచినట్టు. ఒకవేళ స్కోర్లు సమానమైతే.. మ్యాచ్ మొత్తం లో ఆయా టీములు చేసిన బౌండరీలు, సూపర్ ఓవర్ లో చేసిన బౌండరీలు కలిపి లెక్కేస్తారు. ఎవరు ఎక్కువ బౌండరీలు చేశారనేదానిని బట్టి విజేతను నిర్ణయిస్తారు.

నిన్న జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ లో రెండు జట్లూ సమానమైన పరుగులు చేశాయి. దీంతో మ్యాచ్ లో అత్యధికంగా 24 బౌండరీలు చేసిన ఇంగ్లాండ్ జట్టు విజేతగా ప్రకటించారు. వెంట్రుకవాసిలో ఇంగ్లాండ్ కప్ ముద్దాడిందన్నమాట.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories