విండీస్ కు ఆదిలోనే షాక్!

విండీస్ కు ఆదిలోనే షాక్!
x
Highlights

వరల్డ్ కప్ టోర్నీలో ఈరోజు వెస్టిండీస్, బంగ్లాదేశ్ ల మధ్య మ్యాచ్ జరుతుతోంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది బంగ్లాదేశ్ జట్టు. బ్యాటింగ్ కు దిగిన...

వరల్డ్ కప్ టోర్నీలో ఈరోజు వెస్టిండీస్, బంగ్లాదేశ్ ల మధ్య మ్యాచ్ జరుతుతోంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది బంగ్లాదేశ్ జట్టు. బ్యాటింగ్ కు దిగిన విండీస్ ఓపెనర్లు కుదురుకోవడానికి ఇబ్బంది పడ్డారు. బంగ్లా బౌలర్లు తొలి ఓవర్లలో చక్కని బౌలింగ్ తో విండీస్ ను దెబ్బతీశారు. హిట్టర్ గేల్ బంగ్లా బౌలర్లను ఎదుర్కోవడం లో తడబడ్డాడు. 13 బంతులు ఎదురుక్కున్న గేల్ ఒక్క పరుగూ చేయలేకపోయాడు. తానేడురుకున్న పదమూడో బంతికి పరుగులు లేకుండానే పెవిలియన చేరాడు. మహమ్మద్ సైఫుద్దీన్ బౌలింగ్ లో ముషిఫికర్ కు సులువైన క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు గేల్. అటు తరువాత క్రీజులోకి వచ్చిన హోప్, ఓపెనర్ లూయిస్ తో కలిసి విండీస్ ఇన్నింగ్స్ కు మరమ్మతులు చేసే పనిలో పడ్డాడు. మొత్తమ్మీద11ఓవర్లలో విండీస్ జట్టు ఒక్క వికెట్ కోల్పోయి 42 పరుగులు చేసింది. లూయిస్ 24 పుగులతోనూ, హోప్ 13 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories