కట్టడి చేస్తున్న వెస్టిండీస్ బౌలర్లు

కట్టడి చేస్తున్న వెస్టిండీస్ బౌలర్లు
x
Highlights

అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్‌ కోహ్లీ 20 వేల పరుగులు పూర్తిచేసుకున్నాడు. వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు ముందు కోహ్లీ 37 పరుగుల దూరంలో ఉండగా ప్రస్తుత...

అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్‌ కోహ్లీ 20 వేల పరుగులు పూర్తిచేసుకున్నాడు. వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు ముందు కోహ్లీ 37 పరుగుల దూరంలో ఉండగా ప్రస్తుత మ్యాచ్‌లో ఆ పరుగులు పూర్తిచేశాడు. మరో వైపు ఈ మ్యాచ్ లో కోహ్లీ తన అర్థ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇన్నింగ్స్ 27 వ ఓవర్లో థామస్ వేసిన మూడో బంతికి సింగిల్ తీయడం తో మొత్తం 55 బంతుల్లో 50 పరుగులు సాధించాడు. అంతకు ముందు కీమర్‌ రోచ్‌ బౌలింగ్‌లో విజయ్‌శంకర్‌ (14; 19 బంతుల్లో) షాట్‌ ఆడబోయి షైహోప్‌ చేతికి చిక్కడం తో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. ఆ తరువాత బ్యాటింగ్ కు వచ్చిన కేదార్ జాదవ్ ఇన్నింగ్స్ 29 వ ఓవర్లో కీమర్‌ రోచ్‌ కూడా హోప్ కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. మొత్తమ్మీద వెస్టిండీస్ బౌలర్లు టీమిండియా ను కట్టడి చేస్తున్నారనే చెప్పాలి. 30 ఓవర్లు ముగిసేసరికి భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది. కోహ్లీ 53 పరుగులతోనూ, ధోనీ 5 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories